ఇద్దరు ఐఎస్ కమాండర్లు హతం: అఫ్ఘాన్ తాలిబన్ ప్రతినిధి

by S Gopi |
ఇద్దరు ఐఎస్ కమాండర్లు హతం: అఫ్ఘాన్ తాలిబన్ ప్రతినిధి
X

కాబూల్: తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజయిద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆది, సోమవారాల్లో తాలిబన్ బలగాలు జరిపిన సోదాల్లో ముఖ్యమైన ఇస్లామిక్ స్టేట్ ఖొరసన్ ప్రావిన్సు(ఐఎస్‌కేపీ) కమాండర్లు ఇద్దరిని కాబూల్‌లో హతమార్చినట్లు తెలిపారు. వీరిలో ఖరీ ఫతే ఉన్నారని చెప్పారు. ఐఎస్‌కేపీ ఐఎస్ కీలక అనుబంధ సంస్థ కాగా, తాలిబన్లకు ప్రధాన విరోధిగా ఉంది. ఖరీ ఫతే ఐఎస్‌కేపీకి ప్రధాన వ్యూహకర్తగా ఉన్నాడని, కాబూల్‌లోని రష్యన్, పాకిస్తానీ, చైనా దౌత్య కార్యకలాపాలతో సహా అనేక దాడులకు ప్రణాళిక వేశాడని ముజాహిద్ చెప్పాడు. ఇస్లామిక్ స్టేట్ హింద్ ప్రావిన్స్‌కు చెందిన ఉగ్రవాది ఈజాజ్ అహ్మద్ అహంగర్ కూడా మరణించినట్లు ఓ ప్రకటనలో తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed