నేపాల్‌ పర్యటనకు వెళ్లి అదృశ్యమైన ముగ్గురు భారతీయులు .. 10 గంటల పాటు రెస్క్యూ చేసి కాపాడిన పోలీసులు

by Maddikunta Saikiran |
నేపాల్‌ పర్యటనకు వెళ్లి అదృశ్యమైన ముగ్గురు భారతీయులు .. 10 గంటల పాటు రెస్క్యూ చేసి కాపాడిన పోలీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: నేపాల్ పర్యటనకు వెళ్లిన ముగ్గురు భారతీయ పర్యాటకులు తప్పిపోయిన వార్త తాజాగా వెలుగులోకి వచ్చింది. నితిన్ తివారీ, రష్మీ తివారీ అలాగే తనీష్ తివారీ అనే ముగ్గురు భారతీయులు నేపాల్ రాజధాని ఖాట్మండుకు పర్యటన కోసం వెళ్లారు. వారు అక్కడ ఆ దేశానికి చెందిన హరి ప్రసాద్ ఖరేల్నేపాలీ అనే వ్యక్తిని గైడ్ గా నియమించుకున్నారు. ఆ తరువాత ఖాట్మండుకు తూర్పున 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న భక్తపూర్ జిల్లాలోని నాగర్‌కోట్ అటవీ ప్రాంతంలోకి వెళ్లారు.వారు రాణి ఝూలా ప్రాంతానికి వెళ్లే మార్గాన్ని గుర్తించలేక పొరపాటున సమీపంలోని అటవీ ప్రాంతం వైపు వెళ్లడంతో అదృశ్యమయ్యారు. వారి అదృశ్యం గురించి వార్త విన్న వెంటనే సాయుధ పోలీసులు , ప్రజాప్రతినిధులు అలాగే అక్కడ ఉన్న స్థానికుల సహాయంతో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు.దాదాపు 10 గంటల రెస్క్యూ తర్వాత వారు హల్హలే ఖౌపా అనే ప్రాంతంలో కనుగొనబడ్డారు.కాగా రక్షించబడిన వ్యక్తులు సురక్షితంగా తిరిగి ఖాట్మండుకు వచ్చారు.శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో వారు దారి తప్పిపోయారని, రెస్క్యూ టీమ్ అర్ధరాత్రి సంఘటనా స్థలానికి చేరుకొని వారిని సురక్షితంగా రక్షించారని నేపాల్ స్థానిక పోలీసులు వెల్లడించారు.

Next Story

Most Viewed