Tirumala laddu: 'బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి'..తిరుమల లడ్డూ వివాదంపై వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు

by Maddikunta Saikiran |
Tirumala laddu: బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి..తిరుమల లడ్డూ వివాదంపై వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా కొన్ని రోజులుగా తిరుమల శ్రీవారి లడ్డూ(Tirumala Srivari Laddu) ప్రసాదం వ్యవహారం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు(Animal Fat) ఆనవాళ్లు ఉన్నట్లు ల్యాబ్‌ నివేదికలో తేలిందని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు(AP CM Chandrababu)తో పాటు టీటీడీ ఈవో(TTD EO) శ్యామలరావు (Shyamala Rao) వెల్లడించారు. దీంతో ఈ వార్త రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్(Hot Toppic)గా మారింది.ఈ వ్యవహారంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని చాలా మంది రాజకీయ నాయకులు(Political Leaders) డిమాండ్లు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే..తిరుమల లడ్డూ(Tirumala laddu) వివాదంపై తాజాగా మాజీ ఉపరాష్ట్రపతి(Former Vice President) ఎం.వెంకయ్యనాయుడు(M.Venkaiah Naidu) స్పందించారు.ఈ క్రమంలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ..తిరుమల శ్రీవారి లడ్డు తయారీ విషయంలో వస్తున్న వార్తలు నన్ను ఎంతగానో కలచివేశాయని , ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో ఫోన్లో మాట్లాడినట్లు ఎక్స్(X)లో పోస్ట్ చేశారు."తిరుమల శ్రీవారు కోట్లాది భక్తుల ఇలవేల్పు. ఆ స్వామివారి ప్రసాదాన్ని ప్రతి భక్తుడు ఎంతో పవిత్రంగా స్వీకరిస్తారు.వారి ఆత్మీయులకు కూడా శ్రీవారి ఆశీస్సులు ఈ ప్రసాదం ద్వారా లభించాలని లడ్డూని పంచటం మన పెద్దల నుంచి ఆచారంగా వస్తోంది.ఇంతటి ఆధ్యాత్మిక విశిష్టత ఉన్న తిరుమల శ్రీవారి ప్రసాదం విషయంలో నాణ్యతతో పాటు పవిత్రత మరింత కీలకం. అలాంటి పవిత్రతకు భంగం కలిగించే చిన్నపాటి దోషమైన క్షమార్హం కాదని అలాగే నిజా నిజాలను నిగ్గు తేల్చి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ముఖ్యమంత్రి గారికి సూచించా. ఈ విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి గారిని కోరా. అందుకు ఆయన సమ్మతించారని" వెంకయ్యనాయుడు ఎక్స్(X) లో ట్వీట్ చేశారు.

Next Story

Most Viewed