- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మాల్దీవులను విడిచిన భారత సైనిక దళాల రెండో బ్యాచ్
దిశ, నేషనల్ బ్యూరో: మాల్దీవుల నుంచి భారత బలగాలు వెనక్కి వచ్చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తొలి విడతలో కొంత మంది సైనిక సిబ్బంది తిరిగి రాగా, ఇటీవల గురువారం రెండో దశ సైనిక బలగాలు మాల్దీవులు విడిచిపెట్టినట్లు ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు తెలిపారని స్థానిక మీడియా ఎడిషన్ శనివారం నివేదించింది. మే 10 నాటికి భారత సైనిక సిబ్బంది చివరి బ్యాచ్ తిరిగి భారత్ వెళ్లనున్నారని కూడా ధృవీకరించారు. మాల్దీవుల అధ్యక్షుడిగా ముయిజ్జు బాధ్యతలు స్వీకరించిన తర్వాత రెండు దేశాల మధ్య దూరం పెరిగింది.
మాల్దీవుల్లో విధులు నిర్వహిస్తున్న భారత సైనిక దళాలను ఉపసంహరించుకోవాలని ఈ ఏడాది జనవరిలో భారత్‌ను అభ్యర్థించారు. మే 10 నాటికి అందరూ వెళ్లిపోవాలని, ఒక మిలటరీ సిబ్బంది కూడా తమ భూభాగంలో ఉండకూడదని అన్నారు. రాడార్లు, హెలికాప్టర్లు, విమానాలను నిర్వహించే పనుల్లో భారత సైనిక దళాలు ఉండగా, వారు క్రమంగా భారత్‌కు తిరిగి వస్తున్నారు. తొలి విడతలో మార్చి 13 నాటికి 25 మంది మిలటరీ సిబ్బంది మాల్దీవులను విడిచి భారత్‌కు వచ్చారు.
భారత్-మాల్దీవుల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇటీవల కాలంలో బాయ్‌కాట్ మాల్దీవులకు పిలుపునిచ్చారు. దీంతో భారత టూరిస్ట్‌లు ఇప్పుడు లక్ష్యదీప్‌ను ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం మాల్దీవులకు భారత్ నుంచి వచ్చే టూరిస్ట్‌ల సంఖ్య చాలా వరకు తగ్గిపోయింది. దీనివల్ల అక్కడి పర్యాటక రంగం ఆదాయం భారీగా పడిపోయింది. ఈ నేపథ్యంలో పర్యాటకులను తిరిగి ఆకర్షించేందుకు మాల్దీవులకు చెందిన ఒక ప్రధాన పర్యాటక సంస్థ భారత్‌లోని ప్రధాన నగరాల్లో రోడ్ షోలను నిర్వహించనున్నట్లు ప్రకటించింది.