- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దీపావళి వసూళ్ల దందా…నిబంధనలకు నీళ్లు
దిశ, హుజురాబాద్ రూరల్: హుజురాబాద్ లో జోరుగా దీపావళి వసూళ్ల దందా సాగుతుంది. టపాసుల దుకాణాల ఏర్పాటుకు మామూళ్లు శాఖల వారీగా చెల్లించాల్సిందే. దీంతో వ్యాపారులు నిబంధనలు తుంగలో తొక్కారు. వ్యాపారులు ఫైర్, మున్సిపల్, రెవెన్యూ , విద్యుత్ పోలీస్ శాఖలో పనిచేసే కొందరు అధికారులకు మామూళ్లు అందించారు. టపాకాయల విక్రయానికి ఆయా శాఖల పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కొందరు బాణాసంచా విక్రయానికి సంవత్సరం అనుమతి పొందుతుంటే మరికొందరు తాత్కాలికంగా అనుమతి తీసుకుంటారు.
ఇక్కడే అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. తమిళనాడులోని శివకాశి నుంచి దొడ్డి దారిన తెచ్చుకున్న బాణాసంచా సరుకును రాజ మార్గంలో అమ్మేందుకు అనాధికారికంగా అధికారులు అనుమతి ఇచ్చేస్తూ అందిన కాడికి దండుకుంటున్నారు. నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కోసం ఒక్కొక్క శాఖకు దుకాణానికి రూ. 2వేల నుంచి 3 వేల వరకు వసూల్ చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. మామూళ్లు సక్రమంగా అందితేనే అమ్మకాలకు అనుమతి ఇస్తున్నారు. ఈ చెల్లింపులే కాకుండా కాకర్స్ ను వివిధ శాఖల అధికారులు టపాసులు బాణాసంచా మొదలగునవి పట్టుకుని పోతున్నారని వ్యాపారులు పేర్కొంటున్నారు.
నిబంధనలకు నీళ్లు
అధికారులకు మామూళ్లు ఇచ్చామనే ధీమాతో వ్యాపారులు దుకాణాల ఏర్పాటు విషయంలో నిబంధనలను గాలికి వదిలేశారు. జన సంచారం లేని ప్రాంతంలో టపాసులు విక్రయించాలి. పట్టణ శివారులోని ఖాళీ ప్రదేశాల్లో దుకాణాలను ఏర్పాటు చేసుకోవాలి. స్టాల్స్ వద్ద అగ్నిమాపక వాహనాన్ని ఏర్పాటు చేయాలి, దుకాణం వద్ద 200 లీటర్ల సామర్థ్యం ఉన్న రెండు డ్రమ్ములలో నీటిని ఏర్పాటు చేసుకోవాలి, ఒక్కొక్క దుకాణం వద్ద రెండు ఇసుక నింపిన బకెట్లు ఉంచుకోవాలి, దుకాణానికి దుకాణానికి మధ్య కనీసం మూడు మీటర్ల దూరం ఉండాలి. 13 సంవత్సరాల లోపు పిల్లలకు బాణాసంచా విక్రయించరాదు. కానీ మామూలు ఇచ్చామన్న ధీమాతో వ్యాపారులు నియమ నిబంధనలు తుంగలో తొక్కారు.
హుజురాబాద్ పట్టణంలో 16 షాపుల వరకు తాత్కాలిక అనుమతి తీసుకోగా రెండు షాపుల వారు సంవత్సరానికి అనుమతి పొందారు. శాఖల వారిగా ఎవరెవరికి ఎంత ఇవ్వాలనేది ముందుగా నిర్ణయించి వ్యాపారుల వద్ద అధికారులు వసూళ్లు చేసినట్టు సమాచారం. హుజురాబాద్ పట్టణంలోని హైస్కూల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన టపాసుల దుకాణాలు పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేశారు. ఒక్క దుకాణంలో అగ్నిప్రమాదం జరిగితే దుకాణాలు అన్ని కాళీ బూడిద అయ్యే పరిస్థితి ఉంది. దుకాణానికి దుకాణానికి మధ్య మూడు మీటర్లు ఉండాలన్న నిబంధనను గాలికి వదిలేశారు.
నిబంధనలు అతిక్రమిస్తే కేసులు..ఇన్చార్జి ఫైర్ అధికారి, సురేందర్
టపాసుల విక్రయానికి తాత్కాలిక దుకాణాలకు అనుమతి పొందిన వారు నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు జరిగితే చర్యలు తీసుకుంటాం. ఇప్పటివరకు 16 దుకాణాలకు అనుమతి ఇచ్చాము.ఫైర్ అధికారుల జారీ చేసిన లైసెన్స్ తో పాటు ఇతర శాఖల అధికారుల అనుమతులు ఉండాలి. సంబంధిత శాఖల సమన్వయంతో కలిసి దుకాణాలను పరిశీలిస్తాము. నిబంధనలు పాటించని దుకాణాలను తొలగించడంతోపాటు చర్యలు తీసుకుంటాము.