- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న హింస.. స్టార్ ప్రోడ్యూసర్‌ను దారుణంగా కొట్టిచంపిన నిరసన కారులు
దిశ, వెబ్ డెస్క్: మాజీ సైనిక కుటుంబాలకు రిజర్వేషన్లపై చెలరేగిని అల్లర్లు బంగ్లాదేశ్ ను దహనం చేస్తున్నారు. రోజు రోజుకు పరిస్థితులు చేజారిపోవడం బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేశారు. దీంతో ఆ దేశంలో సైనిక పాలన నడుస్తోంది. అయినప్పటికి బంగ్లాదేశ్ లో హింస కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే నిరసన కారులు హిందువల ఇండ్లతో పాటు షాపింగ్ కాంప్లెక్స్, పెద్ద వ్యాపారస్తుల ఇండ్లను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడి అందిన కాడికి దోచుకుని ఎవరైన ఎదిరిస్తే వారి హతమారుస్తున్నారు. ఇందులో భాగంగా బంగ్లాదేశ్ సినిమాల్లో హీరో గా నటించిన వ్యక్తిని దారుణంగా కొట్టి చంపారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
బలియా యూనియన్ లోని ఫరుక్కాబాద్ సమీపంలో ఉంటున్న ప్రముఖ నిర్మాత సలీం ఖాన్, అతని కుమారుడు హీరో శాంటో ఖాన్ లు ఈ రోజు బయటకు వెళ్లారు. అది గమనించిన ఆందోళన కారులు వారిపై దాడి చేయడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో హీరో శాంటో ఖాన్ తన వద్ద ఉన్న గన్ తో వారిని బెదిరించి అక్కడి నుంచి పారిపోయారు. ఈ క్రమంలో వారిని బగారా మార్కెట్ సమీపంలో చుట్టుముట్టిన ఆందోళనకారులు దారుణంగా కొట్టి చంపారు. వారి శవాలను రోడ్లపై ఊరేగించారు. కాగా నిర్మాత సలీం ఖాన్ 10 సినిమాలను నిర్మించగా.. శాంటో ఖాన్ బాబాజాన్, అంటో నగర్ సినిమాల్లో నటించి స్టార్ డమ్ తెచ్చుకున్నాడు.