Oldest Woman: ప్రపంచంలో అతిపెద్ద వయస్కురాలు మృతి.. ప్రస్తుతం ఆమె వయస్సు..?

by Ramesh Goud |
Oldest Woman: ప్రపంచంలో అతిపెద్ద వయస్కురాలు మృతి.. ప్రస్తుతం ఆమె వయస్సు..?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచంలో అతిపెద్ద వయస్కురాలిగా రికార్డు ఉన్న స్పెయిన్ మహిళ మృతి చెందింది. ప్రస్తుతం ఆమె వయస్సు 117 ఏళ్ల 168 రోజులుగా ఉంది. ప్రపంచంలో బతికిఉన్న వాళ్లలో అత్యంత పెద్ద వయస్కురాలిగా గిన్ని బుక్ వరల్డ్ రికార్డ్ నమోదు చేసుకున్న మరియా బ్రాన్యాస్ మోరీరా మరణించారు. స్పెయిన్ కు చెందిన ఆమె.. రెండు ప్రపంచ యుద్దాలను చూడటంతో పాటు రెండు మహమ్మారులను ఎదుర్కొని బతికారు. స్పానిష్ ఫ్లూతో పాటు కోవిడ్ నుంచి కూడా విజయవంతగా బయటపడి.. ఇటీవలే తన 117 వ పుట్టిన రోజు వేడుకలను కూడా ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల సందర్భంగా చేసిన ట్వీట్ లో ఆమె దీర్ఘాయువుకు కారణం వంశపారంపర్యంగా వచ్చిన మంచి జన్యువులు మాత్రమే కాదని, క్రమశిక్షణ, ప్రశాంతత, కుటుంబం, స్నేహితులతో సత్సంబందాలు, ప్రకృతితో ఉన్న అనుబంధం, చింత లేకపోవడం, సానుకూలత అని తెలిపింది. అంతేగాక విషపూరిత వ్యక్తులకు దూరంగా ఉండటం కూడా తన ఆరోగ్యానికి దోహదపడ్డాయని వెల్లడించింది. గతంలో ఈ రికార్డ్ ఫ్రెంచ్ సన్యాసిని సిస్టర్ ఆండ్రే పేరుపై ఉండగా.. ఆమె మరణం తర్వాత మరియా పేరుపై చేరింది.

Advertisement

Next Story

Most Viewed