- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రష్యాను ఎదుర్కోడానికి ఉక్రెయిన్‌లో సామాన్యులకొచ్చిన కొత్త ఐడియా..?!
దిశ, వెబ్‌డెస్క్ః గత ఎనిమిది రోజులుగా కొనసాగుతున్న రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం తీవ్రరూపం దాల్చింది. శుక్రవారం, రష్యా దళాలు ఆగ్నేయ ఉక్రెయిన్‌లో ఉన్న యూరప్‌లోని అతిపెద్ద అణు విద్యుత్ ప్లాంట్‌ను స్వాధీనం చేసుకున్నాయి. ప్రక్కనే ఉన్న ట్రైనింగ్ సెంటర్‌కు నిప్పు పెట్టాయి. ఈ తరుణంలో మడం తిప్పమంటున్న ఉక్రెయిన్‌లు వారి యుద్ద స్ట్రాటజీలో దేన్నీ విడిచిపెట్టట్లేదు. సాధారణ పౌరులు కూడా యుద్ధంలో పాల్గొంటూ రష్యా సైన్యాలను నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఓ సరికొత్త ఐడియాను ప్రచారం చేస్తున్నారు. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ఇంధనంలేక రష్యన్ యుద్ధ ట్యాంకులను రోడ్లపై వదిలివేస్తున్న వీడియోలు కొన్ని వైరల్ అయ్యాయి. ఇక, వీటినే ఇప్పుడు ఉక్రెయిన్‌లు వారికి అనువుగా వాడుకోవాలని ప్రయత్నిస్తున్నారు.
రష్యన్ యుద్దట్యాంక్ ఎదైనా ఖాళీగా కనిపిస్తే దాన్ని ఎలా స్వాధీనం చేసుకొని, డ్రైవ్ చేయాలో సోషల్ మీడియాలో శిక్షణ ఇస్తున్నారు. దీనిపై ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ నాస్త్య టైమాన్ పెట్టిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. వృత్తిరీత్యా కార్ల మెకానిక్ అయిన టైమాన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో "లైఫ్ హ్యాక్" అంటూ వీడియోను పోస్ట్ చేసారు. ఆర్మర్డ్ వెహికల్‌ని ఎలా స్టార్ట్ చేయాలి అనేది ఈ ట్యుటోరియల్ వీడియోలో వివరించారు. ఈ వీడియో వాస్తవానికి ఒక సంవత్సరం క్రితం పోస్ట్ చేసింది. అయితే ఉక్రెయిన్‌లో యుద్ధం ప్రారంభమైన తర్వాత, ఆమె దానిని మళ్లీ కొత్త శీర్షికతో పోస్ట్ చేసింది. ఇక, ఈ వీడియో పోస్ట్ చేసిన కొంత సేపటికే వైరల్ అయ్యింది.
https://www.instagram.com/reel/CaendZ4gAZJ/?utm_source=ig_web_copy_link