బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం కీలక నిర్ణయం.. !

by Maddikunta Saikiran |
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం కీలక నిర్ణయం.. !
X

దిశ, వెబ్‌డెస్క్ : బంగ్లాదేశ్‌లో కొత్తగా ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నోబెల్ శాంతి గ్రహీత ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని కొలువైన మధ్యంతర ప్రభుత్వం పరిపాలనా పునర్వ్యవస్థీకరణలో భాగంగా , వివిధ దేశాలలో విధులు నిర్వహిస్తున్న ఏడుగురు రాయబారులను వెనక్కి పిలిపించినట్లు స్థానిక మీడియా నివేదికలు తెలిపాయి.అమెరికా, రష్యా, సౌదీ అరేబియా, జపాన్, జర్మనీ, యూఏఈ, మాల్దీవులకు గత అవామీ లీగ్ ప్రభుత్వం కాంట్రాక్టు ప్రాతిపదికన ఏడుగురు రాయబారులను నియమించింది. ఇప్పుడు వారు తక్షణమే దేశానికి తిరిగి రావాలని మధ్యంతర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా.. రాయబారి మొహమ్మద్ ఇమ్రాన్ వాషింగ్టన్‌లో, రాయబారి కమ్రుల్ హసన్ మాస్కోలో, రాయబారి జావేద్ పట్వారీ రియాద్‌లో, రాయబారి షహబుద్దీన్ అహ్మద్ టోక్యోలో, రాయబారి మొషరఫ్ హుస్సేన్ బెర్లిన్‌లో, రాయబారి అబు జఫార్ అబుదాబిలో , రాయబారి ఎం అబుల్ కలాం ఆజాద్ మాలేలో తమ విధులు నిర్వహిస్తున్నారు. బంగ్లాదేశ్ లో ఏర్పడిన మధ్యంతర ప్రభుత్వం వారిని రీకాల్ చేసింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రాయబారులకు ప్రత్యేక నోటీసులు జారీ చేస్తూ ప్రస్తుత బాధ్యతలను వదులుకుని బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ప్రధాన కార్యాలయానికి వెంటనే తిరిగి రావాలని సూచించింది. దీంతో వారు బంగ్లాదేశ్ కు పయనమయ్యారు.

Next Story

Most Viewed