చావనైనా చస్తా.. ఆ పని చేయను: రైలు పట్టాలపై తలపెట్టి బాధితుడి ఆవేదన

by srinivas |
చావనైనా చస్తా.. ఆ పని చేయను: రైలు పట్టాలపై తలపెట్టి బాధితుడి ఆవేదన
X

దిశ, వెబ్ డెస్క్: చావనైనా చస్తా అంటూ రైలు పట్టాలపై తలపెట్టి నరసారావుపేటకు చెందిన వలి అనే బాధితుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నరసారావుపేట సీఐ రామకృష్ణ, కానిస్టేబుల్ బాబు తనను వేధిస్తున్నారని, తనకు చావే శరణ్యమని వాపోతూ వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేశ్, పల్నాడు జిల్లా కలెక్టర్, ఎస్పీకి పంపాలని విజ్ఞప్తి చేశారు. తన చావుకు కారణమని సీఐ రామకృష్ణనే కారణమంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

మదార్ వలి చెప్పిన ప్రకారం..

‘‘నాపేరు మదార్ వలి. నరసరావుపేట సీఐ, కానిస్టేబుల్ బాబు రెండు రోజులుగా నాకు ఫోన్లు చేసి టార్చర్ చేస్తున్నారు. మస్తాన్ బాజీ అనే వ్యక్తి దొంగ బండ్ల తాకట్టు వ్యవహారంలో దొరికారట. ఆ కేసులో బాజీని బాగా కొట్టి నా పేరు చెప్పించారు. దానికి సంబంధించి నన్ను రూ. 5 లక్షలు డిమాండ్ చేశారు. ఈ కేసుతో తనకు సంబంధంలేదని చెప్పినా వినడం లేదు. నాపై కేసులు పెడతామని బెదిరించారు. డబ్బులు ఇవ్వాలని ఊరి బయట నాతో కానిస్టేబుల్ బాబు మాట్లాడారు. నేను ఇవ్వను అని చెప్పా. 12 దొంగ బండ్లకు సంబంధించి నీపై కేసు రాశాం. డబ్బులు ఇవ్వాల్సిందేనన్నారు. ఆ కేసుతో నాకు సంబంధంలేదని, చావనైనా చస్తా కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వనని చెప్పా. దీంతో నన్ను వేధిస్తున్నారు. నాకు చావుకు కారణం సీఐ రామకృష్ణ, కానిస్టేబుల్ బాబు.’’ అని వలి ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed