Bhatti Vikramarka : ప్రభుత్వ వైఫల్యాలేంటో కేటీఆర్ చెప్పాలి.. DCM భట్టి విక్రమార్క ప్రశ్నలు

by Ramesh N |
Bhatti Vikramarka : ప్రభుత్వ వైఫల్యాలేంటో కేటీఆర్ చెప్పాలి.. DCM భట్టి విక్రమార్క ప్రశ్నలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తాము కక్ష రాజకీయాలకు వ్యతిరేకమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాట్ కామెంట్స్ చేశారు. గాంధీభవన్‌లో నెహ్రూ జయంతి వేడుకల్లో పాల్గొన్న భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రతిపక్షంగా తన పాత్ర పోషించిందా? అని ప్రశ్నించారు. ఉన్న ప్రభుత్వాన్ని కూల్చడంపైనే బీఆర్ఎస్ దృష్టి పెట్టిందన్నారు. కేటీఆర్ గురించి మాట్లాడాలంటే చాలా మాట్లాడవచ్చని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యం ఏంటో కేటీఆర్ చెప్పాలని ప్రశ్నించారు. నిరుద్యగులకు ఉద్యోగాలు ఇవ్వడమే ప్రభుత్వ వైఫల్యమా? అని నిలదీశారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టడం ప్రభుత్వ వైఫల్యమా? అని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ చేయడం ప్రభుత్వ వైఫల్యమా? అని ప్రశ్నించారు. ప్రజలకు మంచి చేయడం ప్రభుత్వ వైఫల్యమా? అని ప్రశ్నించారు. మీరు అధికారం కోల్పోయి నప్పుడల్లా అమాయక ప్రజలను రెచ్చగొడుతున్నారని ఫైర్ అయ్యారు. ఫార్మా క్లస్టర్స్ విస్తరించే పనిని వ్యతిరేకించడం బుద్ధి తక్కువ పని అని విమర్శించారు.

స్కీములు పెరగాడానికే కులగణన

కుల గణన విప్లవాత్మక నిర్ణయమని, దేశానికి తెలంగాణ రోల్ మోడల్ కాబోతుందని భట్టి ధీమా వ్యక్తం చేశారు. స్కీములు పెరగాడానికి కులగణన చేస్తున్నామని స్పష్టం చేశారు. కుల గణన చేశామని మాట ఇచ్చామని, ఇచ్చిన మాటను చేసి చూపిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి కుల గణన ఎంతగానో ఉపయోగపడుతుందని వెల్లడించారు. అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొనే ప్రశ్నలు తయారు చేశామన్నారు.

Advertisement

Next Story

Most Viewed