Thaman: తమన్ కు ప్రత్యేక కృత‌జ్ఞతలు తెలిపిన సజ్జనార్

by Prasanna |   ( Updated:2024-11-15 15:26:43.0  )
Thaman: తమన్ కు ప్రత్యేక  కృత‌జ్ఞతలు తెలిపిన సజ్జనార్
X

దిశ, వెబ్ డెస్క్ : ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ అంధ యువ‌కుడికి ఒక్క అవకాశం ఇవ్వాలంటూ సంగీత ద‌ర్శ‌కుడు ఎంఎం కీర‌వాణిని ట్విట్టర్ ద్వారా కోరారు. అయితే, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ స్పందించి ఇండియ‌న్ ఐడ‌ల్ సీజ‌న్ 4లో పాడుతాడు. అతడిలో గొప్ప టాలెంట్ ఉందంటూ ప్రశంసించారు.

తాజాగా, ఈ ట్వీట్ పై స‌జ్జ‌నార్ రియాక్ట్ అయ్యారు. " అద్భుత‌మైన కంఠంతో పాట‌లు ఆల‌పిస్తోన్న ఈ అంధ యువ‌కుడికి ఆహా నిర్వహిస్తోన్న తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ లో అవ‌కాశం ఇచ్చేలా చూస్తాన‌ని ప్ర‌క‌టించిన ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు థమన్ గారికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. ఈ అవ‌కాశంతో అద్భుత‌మైన త‌న టాలెంట్‌కు మ‌రింత‌గా గుర్తింపు ద‌క్కుతుంది. భవిష్యత్ లో త‌న మ‌ధుర‌మైన గాత్రంతో ఎంతో మందిని మంత్ర ముగ్దుల‌ను చేస్తూ ఈ యువకుడు ఉన్న‌తంగా ఎదుగుతార‌ని ఆశిస్తున్నాను " అంటూ ట్వీట్ లో రాసుకొచ్చారు.


👉 Click Here For Tweet!







Advertisement

Next Story