- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP News: గౌతమ్‌రెడ్డిపై రౌడీషీట్ క్లోజ్.. అన్నీ తేలుస్తామన్న బెజవాడ సీపీ
దిశ, వెబ్ డెస్క్: వైసీపీ నేత, ఫైబర్ నెట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ గౌతమ్ రెడ్డిపై (Gautam Reddy) రౌడీ షీట్ ను ఎందుకు క్లోజ్ చేశారో విచారణ చేసి తేలుస్తామన్నారు విజయవాడ సీపీ రాజశేఖర్ (Vijayawada CP Rajasekhar) బాబు. గురువారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. గౌతమ్ రెడ్డి ఓ కిరాయి హత్యకు ప్లాన్ చేసినట్లు తమ విచారణలో తేలిందన్నారు. అతనిపై హత్య సహా 43 కేసులు నమోదైనట్లు తెలిపారు. గతంలోనూ రౌడీ షీట్ నమోదైందని, దానిని ఎందుకు క్లోజ్ చేశారో విచారణ చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకూ గౌతమ్ రెడ్డిపై అనేక ఫిర్యాదులు అందాయన్న సీపీ.. ముఖ్యంగా ఓ ల్యాండ్ ను నకిలీ డాక్యుమెంట్లతో అమ్మినట్లు కేసు నమోదైందన్నారు.
ఉమామహేశ్వరశాస్త్రి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. సత్యనారాయణపురం శివాలయం వీధిలో ఉంటున్న అతని తల్లి పేరున లక్ష్మీనగర్లో 325 చదరపు అడుగుల స్థలం కొనుగోలు చేసి 2014లో రిజిస్టర్ చేశారు. ఆ స్థలాన్ని గౌతమ్ రెడ్డి ఫోర్జరీ పత్రాలతో కబ్జా చేశారని ఆరోపిస్తున్నారు. దీనిపై ఏడేళ్లుగా వివాదం జరుగుతుండగా.. గౌతమ్ రెడ్డి విజయవాడ కార్పొరేషన్ అనుమతితో రెండు అంతస్తుల నిర్మాణం కూడా చేశాడు. 2017లో ఉమా కేసు పెట్టగా.. గౌతమ్ హైకోర్టులో (AP High Court) స్టే తెచ్చుకున్నాడు. ఉమా న్యాయపోరాటంతో అధికారులు కూల్చివేతలకు సిద్ధం కాగా.. మళ్లీ 4 వారాలకు స్టే తెచ్చుకున్నాడు గౌతమ్. ప్రస్తుతం ఈ స్థలం రూ.10 కోట్లు ఉంటుంది.
ఈ కేసులో నిందితులైన ఐదుగురు పరారీలో ఉండగా నలుగురిని అరెస్ట్ చేశామని, అనిల్ అనే వ్యక్తి కోసం గాలింపు కొనసాగుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారెవరినీ వదిలిపెట్టమని సీపీ హెచ్చరించారు.