Ap News: ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామరాజు.. ఏకగ్రీవంగా ఎన్నిక

by srinivas |
Ap News: ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామరాజు.. ఏకగ్రీవంగా ఎన్నిక
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామకృష్ణంరాజు(AP Deputy Speaker Raghuramakrishnam Raju) ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. ఈ మేరకు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు(Speaker Chintakayala Ayyannapatrudu) ప్రకటించారు. డిప్యూటీ స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేసిన రఘురామరాజును పోటీలో ఎవరు లేకపోవడంతో ఏకగ్రీవంగా ఆమోదించారు. దీంతో రఘురామరాజును డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నుకుంటూ ఏపీ అసెంబ్లీ(AP Assembly)లో ప్రకటించారు. రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి తరపున తూర్పుగోదావరి జిల్లా నుంచి ఉండి నుంచి పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థి పీవీఎల్ రాజుపై 56 వేల ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు. పార్టీ బలోపేతం కోసం రఘురామరాజు కృషి చేస్తుండటంతో తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party) ఆయనకు డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపాదించింది. పార్టీ నేతలు, కూటమి భాగస్వాములు సైతం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో డిప్యూటీ స్పీకర్‌గా రఘురామరాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Advertisement

Next Story