Meenakshi Chaudhary: నా లైఫ్‌లో నాకు ఈ మంత్ చాలా స్పెషల్.. యంగ్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Kavitha |   ( Updated:2024-11-14 07:13:28.0  )
Meenakshi Chaudhary: నా లైఫ్‌లో నాకు ఈ మంత్ చాలా స్పెషల్.. యంగ్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ మీనాక్షి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ రేంజ్‌కి వెళ్ళిపోయింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంది. ఇక నేడు ఈ భామ నటించిన ‘మట్కా’ మూవీ రిలీజ్ అయింది. మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ఈ సినిమా నేడు థియేటర్లలో విడుదలై మిక్సడ్‌ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలో యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. మట్కా సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనాక్షి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

ఆమె మాట్లాడుతూ.. ‘ అమ్మ, సిస్టర్, ప్రేయసి, భార్య ఇలా ఏదో ఒక విధంగా ప్రతి అబ్బాయి జీవితంలో ఓ మహిళ ఉంటుంది. ఆ అబ్బాయి జీవితానికి ఎంతో ముఖ్యంగా ఉంటూ, అతనికి లైఫ్‌కి ఓ పాజిటివిటీని క్రియేట్ చేస్తుంది. అలా వాసు(మట్కా సినిమాలో వరుణ్ తేజ్ పాత్ర) జీవితానికి సుజాత ఓ వెలుగు వంటిది. సుజాత పాత్రలోని పాజిటివిటీ వాసు జీవితంపై ఉంటుంది. ఈ పాజిటివిటీకి ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతారని నేను నమ్ముతున్నాను. నాకు మట్కా విజయంపై నమ్మకం ఉంది.

అలాగే రీసెంట్‌గా ‘లక్కీ భాస్కర్’ చిత్రం ఆల్రెడీ విడుదలై మంచి విజయం సాధించింది. మట్కా విడుదలవుతోంది. ఇక ఇదే నెలలో ‘మెకానిక్ రాకీ’ చిత్రం కూడా విడుదలవుతోంది. ఇలా నెల రోజుల వ్యవధిలోనే మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. నా లైఫ్‌లో ఈ నెల చాలా ప్రత్యేకం. ఈ మంత్‌ని ఓ స్పెషల్ మూమెంట్‌గా భావిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed