Rashi Khanna: బ్రేకప్ వల్ల చాలా బాధపడ్డా.. ఆ సంఘటన ఎప్పటికీ మర్చిపోను: రాశీఖన్నా

by Hamsa |   ( Updated:2024-11-13 08:24:57.0  )
Rashi Khanna: బ్రేకప్ వల్ల చాలా బాధపడ్డా.. ఆ సంఘటన ఎప్పటికీ మర్చిపోను: రాశీఖన్నా
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రాశీఖన్నా(Rashi Khanna) ‘ది సబర్మతీ రిపోర్ట్’(The Sabarmati Report) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రంలో విక్రాంత్ మాస్సే(Vikrant Massey) హీరోగా నటిస్తున్నాడు. రిధి డోగ్రా(Ridhi Dogra) కీలక పాత్రలో నటిస్తుండగా.. శోభా కపూర్, ఏక్తా కపూర్(Ekta Kapoor) నిర్మించారు. అయితే ఈ మూవీ నవంబర్ 15న థియేటర్స్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో.. తాజాగా, రాశీఖన్నా ప్రమోషన్స్‌లో పాల్గొని ఎమోషనల్ కామెంట్స్ చేసింది.

‘‘దక్షిణాదిలో నేను ఎన్నో చిత్రాల్లో నటించా. అక్కడి ప్రేక్షకులు ఎంతో ఆదరించారు. హీరోయిన్‌గా చేసిన ‘ఊహలు గుసగుసలాడే’ మూవీ విడుదలయ్యాక మేము తిరుపతి వెళ్లాం. పెద్ద ఎత్తున జనాలు మమ్మల్ని చుట్టుముట్టారు. అప్పుడు నాకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. మేనేజర్‌ని అడిగితే వాళ్లందరూ నాకోసమే వచ్చారని చెప్పడంతో షాక్ అయ్యాను. ఆ సంఘటన ఎప్పటికీ మర్చిపోను. అభిమానులు తోపులాట చేయడంతో మేనేజర్, బౌన్సర్లు ఇబ్బంది పడ్డారు. ఫేమ్ గురించి అప్పటికీ నాకు తెలియదు.

రాను రాను దానిని అలవాటు చేసుకున్నా. ఇక నా పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. నేను చాలా ఎమోషనల్ పర్సన్. గతంలో నాకు ఓ లవ్ స్టోరీ(Love Story) ఉండేది. కొన్ని కారణాల వల్ల బ్రేకప్ అయింది. ఆ సమయంలో చాలా బాధపడ్డాను. మానసికంగా ఒత్తిడికి గురయ్యాను. ఆ తర్వాత నన్ను నేను మార్చుకున్నా. స్ట్రాంగ్‌గా నిలబడి కెరీర్‌పై దృష్టి పెట్టా. ఇండస్ట్రీలో కంటే బయటే నాకు ఎంతో మంది స్నేహితులు ఉన్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులే నాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తుంటారు. వారు నా బలం అని చెప్పుకుంటా’’ అని చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story