- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
Komatireddy: ఎంతటివాళ్లైనా వదిలే ప్రసక్తే లేదు: లగచర్ల దాడి ఘటనపై కోమటిరెడ్డి ఫైర్
దిశ, వెబ్‌డెస్క్: కొడంగల్ నియోజకవర్గంలో ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్‌పై దాడి చేయడంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్‌పై దాడి అమానుషమని, దాడి చేసిన వాళ్లు ఎంతటి వాళ్లైనా వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు. బుధవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. దాడికి ప్రోత్సహించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులను, పాల్గొన్న వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా దాడులకు పాల్పడిన వాళ్లందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అధికారం కోల్పోవడంతో ఫ్రస్టేషన్లో ఉన్న బీఆర్ఎస్ నేతలు ఇలాంటి దాడులను ప్రోత్సహిస్తున్నారని, దాడికి పాల్పడిన నేతలు కేటీఆర్‌తో కూడా ఫోన్లో టచ్‌లోనే ఉన్నారని, పోలీసుల దర్యాప్తులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు చేయవచ్చు కానీ కలెక్టర్‌పై దాడులకు పాల్పడడం సరైన పద్ధతి కాదని సూచించారు. అనంతరం ఫోన్ ట్యాపింగ్ కేసులో అతి త్వరలో అందరూ జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందేనని, వాళ్లు ఎక్కడ దాక్కున్న రప్పించి జైలుకు పంపిస్తామని బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి సంచలన కామెంట్స్ చేశారు.
అనంతరం బీజేపీపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ముగ్గురు కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ పత్తి కొనుగోలుపై నోరు మెదపడం లేదని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పత్తికి మద్దతు ధర గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ఆ పార్టీ నాయకులంతా మూసి ప్రక్షాళనను అడ్డుకుంటామని మాట్లాడుతున్నారే కానీ రైతుల గురించి మాట్లాడటం లేదని విమర్శించారు. అనంతరం ధాన్యం కొనుగోలు గురించి మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు విషయంలో కొందరు రైస్ మిల్లర్ల వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. వారం రోజులలో మొత్తం ధాన్యం కొనుగోలు చేస్తాం. రైస్ మిల్లర్లు రైతులను ఇబ్బందుల గురిచేస్తే సహించేది లేదు. నాగార్జునసాగర్ ప్రాంతంలో ఇప్పుడిప్పుడే రైతులు వరి కోతలు ప్రారంభించారు. రైస్ మిల్లర్లతో మాట్లాడి రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం’’ అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు.