- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
కేసులు పెడితే తప్పేంటి?: జర్నలిక్టుకు షాకిచ్చిన హైకోర్టు
దిశ, డైనమిక్ బ్యూరో: అసభ్యకర పోస్టులు పెట్టినవారిపై పోలీసులు కేసులు పెడితే తప్పేముందని న్యాయస్థానం ప్రశ్నించింది. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెడుతున్నవారిపై పోలీసులు కేసులు పెడుతున్నారంటూ పిల్ వేయడంపై హైకోర్టు అభ్యంతరం తెలిపింది. సోషల్ మీడియా ఆక్టివిస్ట్‌లపై పోలీసులు మూకుమ్మడిగా కేసులు నమోదు చేయడంపై జర్నలిస్టు విజయబాబు వేసిన పిల్‌పై హైకోర్ట్‌లో ఈరోజు విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఈ కేసులకు సంబంధించి పిల్ వేయడంపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక దశలో న్యాయమూర్తులను కూడా అవమానపర్చేలా పోస్టులు పెట్టారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పోలీసుల చర్యలను నిలువరిస్తూ ఎలాంటి బ్లాంకెట్ ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టీకరించింది. పోలీసులు పెట్టిన కేసులపై అభ్యంతరం ఉంటే సంబంధిత వ్యక్తులు నేరుగా కోర్టును ఆశ్రయించవచ్చని వెల్లడించింది.
ఇటీవల కాలంలో కొన్ని సోషల్ మీడియాల్లో కొంతమంది మహిళలను కూడా దూషిస్తూ పెట్టిన పోస్టులను హైకోర్టు ధర్మాసనం దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనికి ముందే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం మాత్రం జడ్జిలపై కూడా పోస్టులు పెట్టారని, ఇలా అసభ్యకరంగా పోస్టులు పెడితే తామెలా నిలువరించగలమని నిలదీసింది. అదేవిధంగా అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వారిని పోలీసులు చట్టం ప్రకారం తప్పనిసరిగా వారిపై కేసులు నమోదు చేస్తారని స్పష్టం చేసింది.