- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
రైస్ మిల్లులకు తరలించిన ధాన్యాన్ని విధిగా ట్యాబ్ లో ఎంట్రీ చేయాలి : కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
దిశ,తాడ్వాయి: కొనుగోలు చేసిన ధాన్యాన్ని సంబంధిత రైస్ మిల్లులకు తరలించి,ట్యాబ్ ఎంట్రీ త్వరగా చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు.బుధవారం తాడ్వాయి మండలం ఎండ్రియాల్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యం యొక్క తేమశాతం పరిశీలించి, నిబంధనల మేరకు కొనుగోలు చేయాలనీ, కొనుగోలు చేసిన ధాన్యం ను సెంటర్ కు కేటాయించిన రైస్ మిల్లుకు తరలించాలని తెలిపారు. రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యం ను ట్యాబ్ ఎంట్రీ చేయాలని తెలిపారు. రైతులకు రెండు, మూడు రోజుల్లో చెల్లింపులు జరిగేలా చూడాలని తెలిపారు.
అంతరం ఎర్రపహడ్ గ్రామంలో చేపడుతున్న సర్వేను ఆయన పరిశీలించారు.సామాజిక,ఆర్థిక,విద్య, ఉపాధి,రాజకీయ,కుల సర్వే ను పకడ్బందీగా అన్ని అంశాలకు సంబంధించిన వివరాలను ప్రతీ ఇంటి యజమాని నుండి సేకరించాలని అధికారులకు సూచించారు.ప్రభుత్వం జారీచేసిన ప్రశ్నావళి ప్రకారం ప్రతీ ఇంటిలోని వారి నుండి పూర్తి సమాచారాన్ని సేకరించి నమోదు చేయాలని తెలిపారు.కుటుంబం లోని ప్రతీ ఒక్కరి సమాచారాన్ని నమోదు చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ముఖ్య ప్రణాళిక అధికారి రాజారాం,ఎంపీడీవో సాజిదాలి,ఎమ్మార్వో రహీముద్దీన్ ఎంపీఓ సబిత రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.