AP News:మండలి నుంచి వైసీపీ ఎమ్మెల్సీల వాకౌట్.. కారణం ఇదే!

by Jakkula Mamatha |
AP News:మండలి నుంచి వైసీపీ ఎమ్మెల్సీల వాకౌట్.. కారణం ఇదే!
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ శాసన మండలి నుంచి వైసీపీ ఎమ్మెల్సీ(YCP MLC)లు వాకౌట్ చేశారు. విజయనగరం(Vijayanagaram)లో డయేరియా వ్యాప్తి విషయంలో మంత్రి సత్యకుమార్(Minister Satyakumar) వ్యాఖ్యలను నిరసిస్తూ వాకౌట్ చేసినట్లు సభ్యులు ప్రకటించారు. అనంతరం బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) మీడియాతో మాట్లాడారు. ‘సత్య కుమార్ వ్యాఖ్యలు బాధాకరం. సభలో ఆయన వ్యక్తిగతంగా మాట్లాడటం సరికాదు. ఆయనకు పైశాచిక ఆనందం ఉన్నా సరే, సభలో హుందాగా మెలగాల్సింది’ అంటూ బొత్స ఫైరయ్యారు.

ఈ రోజు (బుధవారం) శాసన మండలి సమావేశం ప్రారంభం కాగానే విజయనగరం జిల్లా గొర్ల మండలంలో డయేరియా పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ క్షమాపణలు చెప్పాలంటూ వైసీపీ డిమాండ్ చేసింది. చైర్మన్ పోడియం వద్దకు వెళ్లి వైసీపీ సభ్యులు నిరసన తెలిపారు. అనంతరం ప్రభుత్వం నుంచి సరియైన సమాధానం రాలేదని సభ నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు.

Advertisement

Next Story