Droupadi Murmu: హైదరాబాద్ కు రాష్ట్రపతి.. కోటి దీపోత్సవానికి హాజరు

by Y.Nagarani |
Droupadi Murmu: హైదరాబాద్ కు రాష్ట్రపతి.. కోటి దీపోత్సవానికి హాజరు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ఈ నెల 21,22 తేదీల్లో హైదారాబాద్ లో పర్యటించనున్నారు. ఈ నెల 21వ తేదీ గురువారం సాయంత్రం ఆమె హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచీ నేరుగా ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే కోటి దీపోత్సవానికి (Koti Deepotsavam) హాజరవుతారు. 22వ తేదీ శుక్రవారం హైటెక్ సిటీలోని (Hitech City) శిల్పకళా వేదికలో (Shilpakala Vedika) జరిగే లోక్ మంతన్ 2024 (Lok Mantan ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రపతి పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed