Priyanka gandhi: గ్యాస్ చాంబర్‌లోకి ప్రవేశించినట్టు ఉంది: ఢిల్లీ కాలుష్యంపై ప్రియాంక గాంధీ

by vinod kumar |
Priyanka gandhi: గ్యాస్ చాంబర్‌లోకి ప్రవేశించినట్టు ఉంది: ఢిల్లీ కాలుష్యంపై ప్రియాంక గాంధీ
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఉపఎన్నికల్లో పోటీ చేసి కేరళలోని వయనాడ్ (Wayanad) నుంచి ఢిల్లీకి తిరిగి వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) అక్కడ ఉన్న కాలుష్యంపై స్పందించారు. ఢిల్లీకి తిరిగి రావడంతో గ్యాస్ చాంబర్‌లోకి ప్రవేశించినట్టు ఉందని తెలిపారు. స్వచ్ఛమైన గాలిని తీసుకురావడానికి ఐక్యంగా ఉండాలని తెలిపారు. ‘వయనాడ్‌లో స్వచ్ఛమైన గాలి ఉంది. ఏయిర్ క్వాలిటీ ఇండెక్స్(AQI) 35గా ఉండి ఉంటుంది. అక్కడి నుంచి ఢిల్లీకి వస్తే గ్యాస్ చాంబర్‌లోకి చేరినట్టు ఉంది. ఏమీ కనిపించకుండా ఉన్న బయటి పొగ చూసినప్పుడు ఆందోళన కలుగుతోంది’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఢిల్లీలో ప్రతి ఏటా కాలుష్యం పెరుగోతందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ ఐక్యమై దీనిని పరిష్కారాన్ని కనుగొనాలని సూచించారు. దీని ప్రభావంతో ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారికి శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా ఉందని తెలిపారు. కాగా, ఢిల్లీలో గాలి నాణ్యత గురువారం తీవ్ర స్థాయికి చేరుకుంది. పలు ప్రాంతాల్లో ఏక్యూఐ 500 దాటింది.

Advertisement

Next Story

Most Viewed