దక్షిణాఫ్రికాలో భారీ భూకంపం..

by Vinod kumar |
దక్షిణాఫ్రికాలో భారీ భూకంపం..
X

జోహన్నెస్‌బర్గ్ : దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ సిటీ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున 2:38 గంటలకు 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం ధాటికి జోహన్నెస్‌బర్గ్ సిటీ ఉన్న గౌటెంగ్ ప్రావిన్స్ అంతటా భవనాలు కంపించాయని అమెరికా జియోలాజికల్ సర్వే విభాగం వెల్లడించింది. ఆల్బర్టన్‌ టౌన్ కు దక్షిణంగా 6 కిలోమీటర్ల దూరంలో లేదా సెంట్రల్ జోహన్నెస్‌బర్గ్‌కు ఆగ్నేయంగా 16 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని తెలిపింది. ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఈ ప్రకంపనలను ఫీల్ అయ్యారు. ఈ నేపథ్యంలో కొంతమంది తమ ఇంటి గోడలకు ఏర్పడిన పగుళ్ల ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. "మా ఇల్లు మొత్తం 40 సెకన్ల పాటు కదిలింది" అని ఆల్బర్టన్‌ టౌన్ కు చెందిన ఒక వ్యక్తి పోస్ట్ పెట్టాడు.

Advertisement

Next Story