‘మాస్కో ఉగ్రదాడి’ వెనుక ఉక్రెయిన్, నాటో : రష్యా

by Hajipasha |
‘మాస్కో ఉగ్రదాడి’ వెనుక ఉక్రెయిన్, నాటో : రష్యా
X

దిశ, నేషనల్ బ్యూరో : మాస్కోలోని సంగీత కచేరీ హాల్‌పై మార్చి 22న జరిగిన ఉగ్రదాడిపై రష్యా ఫెడరల్‌ సెక్యూరిటీ సర్వీస్‌ (ఎఫ్‌ఎస్‌బీ) అధిపతి అలెగ్జాండర్‌ బోర్టినికోవ్‌ కీలక వివరాలను వెల్లడించారు. ఆ మారణకాండతో ఉక్రెయిన్‌, నాటో దళాలకు సంబంధం ఉందని ఆయన తెలిపారు. ఉక్రెయిన్‌, నాటో దళాల మార్గనిర్దేశం మేరకే ఐసిస్ ఉగ్రవాదులు మాస్కోలోని సంగీత కచేరీ హాల్‌పై దాడిచేశారని చెప్పారు. రష్యాకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఆఫ్ఘనిస్తాన్‌తో పాటు మధ్య ప్రాచ్య, ఉత్తర ఆఫ్రికా దేశాలు ఉక్రెయిన్‌కు కిరాయి సైనికులను సమకూరుస్తున్నాయని అలెగ్జాండర్‌ బోర్టినికోవ్‌ దుయ్యబట్టారు. ఈ ఘటనతో తమకు సంబంధం లేదని ఇప్పటికే ఉక్రెయిన్‌ స్పష్టం చేసింది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లు ఆధారాలు లేవని అమెరికా వెల్లడించింది. కాగా, ఈ దాడికి పాల్పడింది తామేనంటూ ఇస్లామిక్‌ స్టేట్‌ ప్రకటించుకుంది.

Advertisement

Next Story

Most Viewed