అగ్ర రాజ్యాల మధ్య మరో గొడవ.. సిరియా గగనతలంపై కవ్వింపు చర్యలు..

by Vinod kumar |
అగ్ర రాజ్యాల మధ్య మరో గొడవ.. సిరియా గగనతలంపై కవ్వింపు చర్యలు..
X

వాషింగ్టన్ : రష్యా, అమెరికా మధ్య జగడాలు ముదురుతున్నాయి.. సిరియా వేదికగా ఈ రెండు అగ్ర రాజ్యాల మధ్య మరో గొడవ జరిగింది.. సిరియా గగనతలంపై ఎగురుతున్న తమ డ్రోన్‌లను రష్యా విమానాలు మళ్లీ వేధించాయని అమెరికా ఆర్మీ ఆరోపించింది. సిరియా దేశం వేదికగా జరిగిన ఈ గగనతల గొడవకు సంబంధించిన వీడియోను అమెరికా వైమానిక దళం విడుదల చేసింది. అమెరికా ఎయిర్ ఫోర్స్ కు చెందిన “ఎంక్యూ-9 రీపర్” డ్రోన్ వెళ్తున్న మార్గంలోకి రష్యన్ మిలిటరీ విమానాలు ఎస్ యూ-34, ఎస్ యూ-35 లు మంటలను విడుదల చేస్తున్నట్టు ఆ వీడియోలో ఉంది.

జూలై 6న (గురువారం) ఉదయం 9:30 గంటలకు ఈ ఘటన జరిగిందని అమెరికా తెలిపింది. సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ జిహాదిస్ట్ గ్రూప్‌ శిబిరాలపై వైమానిక దాడులు చేస్తున్న అమెరికన్ డ్రోన్‌‌పై రష్యా విమానాలు ఈ వేధింపులకు పాల్పడ్డాయని అమెరికా ఎయిర్ ఫోర్స్ లెఫ్టినెంట్ జనరల్ అలెక్సస్ గ్రిన్‌కేవిచ్ వెల్లడించారు. ఈ ఏడాది ప్రారంభంలో కూడా నల్ల సముద్రం మీదుగా వెళ్తున్న తమ డ్రోన్ ప్రొపెల్లర్‌ను రష్యా జెట్ క్లిప్ చేయడంతో.. అది క్రాష్ అయ్యిందని అమెరికా ఆరోపించింది. అయితే ఈ ఆరోపణను రష్యా అప్పట్లో తిరస్కరించింది.

Advertisement

Next Story

Most Viewed