Uttarapradesh: యూపీ స్కూల్‌లో లైంగిక వేధింపులకు పాల్పడిన టీచర్ అరెస్ట్

by S Gopi |
Uttarapradesh: యూపీ స్కూల్‌లో లైంగిక వేధింపులకు పాల్పడిన టీచర్ అరెస్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో: విద్యార్థినులను అనుచితంగా తాకుతున్న ఓ ఉపాధ్యాయుడి వ్యవహారం ఉత్తరప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన పిల్లలకు తెలియకుండా వేధింపులకు పాల్పడుతున్నట్టు మరొక ఉపాధ్యాయుడు గుర్తించిన తర్వాత ఈ వ్యవహారం బయటపడింది. ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్ జిల్లాలో ఉన్న ఓ ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. 'గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ' గురించి చిన్నారులకు వివరించేందుకు 1 నుంచి 3 తరగతుల బాలికలను టీచర్ కలిశారని గ్రామ పెద్ద రూప్ సింగ్ విలేకరులతో చెప్పారు. ఇంటరాక్షన్ జరుగుతున్నప్పుడు బ్యాడ్ టచ్ గురించి వివరించే సమయంలో మరో టీచర్ తమతో తరచుగా అలా చేశారని పలువురు చిన్నారులు చెప్పారు. దీంతో వేధింపులకు పాల్పడుతున్న టీచర్ చాలాకాలంగా బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టు బయటపడింది. వ్యవహారం ముదరడంతో ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆ గ్రామపెద్దల ఆధ్వర్యంలో చిన్నారుల తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌ను చుట్టుముట్టారు. ఈ విషయాన్ని బయటకు రాకుండా పాఠశాల, విద్యాశాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ గ్రామస్తులు లలిత్‌పూర్‌లోని తల్‌బేహాట్ పోలీస్ స్టేషన్ వద్ద గుమిగూడి ఉపాధ్యాయుడిపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఉపాధ్యాయుడిని అరెస్ట్ చేసి, విచారణ జరుపుతున్నట్టు పేర్కొన్నారు.

Advertisement

Next Story