- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Babita Phogat: వేల కోట్లు ఆర్జించిన దంగల్ సినిమా టీమ్ రూ. కోటి మాత్రమే ఇచ్చారు: బబితా ఫొగట్
దిశ, నేషనల్ బ్యూరో: ప్రముఖ బాలీవుడ్ సినిమా దంగల్‌కు స్పూర్తిగా నిలిచిన భారత మాజీ రెజ్లర్ బబితా ఫొగట్ కీలక వ్యాఖ్యలు చేశారు. రెజ్లింగ్ నుంచి రిటైర్‌మెంట్ తీసుకున్న ఆమె రాజకీయాల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రూ. 2,000 కోట్లతో భారత్‌లోనే అత్యధిక వసూళ్లతో రికార్డు కొట్టిన దంగల్ సినిమా నుంచి తమకు కేవలం రూ. కోటి మాత్రమే అందిందని అన్నారు. ఈ సినిమా ద్వారా నిర్మాణ సంస్థ వేలాది కోట్లను ఆర్జించిందని, కానీ తమ కుటుంబానికి మాత్రం రూ. కోటి చెల్లించారన్నారు. అయితే, రికార్డు స్థాయిలో కోట్లను ఈ సినిమా ఇచ్చినప్పటికీ కోటి మాత్రమే ఇవ్వడం నిరూత్సాహపరిచిందని, అయితే తనకు, తన కుటుంబానికి గౌరవం, ప్రేమ సంపాదించడమే ముఖ్యమని బబితా ఫొగట్ విలేకరుల సమావేశంలో చెప్పారు. అంతేకాకుండా తమ గ్రామంలో అకాడమీ నిర్మాణానికి సాయం కోసం సినిమా టీమ్‌ను కలిస్తే, పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, 2016 ఆఖరులో విడుదలైన దంగల్ సినిమా బబితా ఫొగట్, ఆమె అక్క గీతా ఫొగట్, వారి తండ్రి మహవీర్ ఫొగట్ కథ ఆధారంగా రూపొందించారు. మహవీర్ ఫొగట్ తన కుమార్తెలను దేశం గర్వించదగిన రెజ్లర్లుగా తీర్చిదిద్దే అంశం చుట్టూ కథ ఉంటుంది.