Madhabi Puri Buch: రేపు పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ముందు హాజరుకానున్న సెబీ చీఫ్ మాధబి పురీ బుచ్..!

by Maddikunta Saikiran |   ( Updated:2024-10-23 17:39:38.0  )
Madhabi Puri Buch: రేపు పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ముందు హాజరుకానున్న సెబీ చీఫ్ మాధబి పురీ బుచ్..!
X

దిశ, వెబ్‌డెస్క్: సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI) ఛైర్ పర్సన్ మాధబి పురీ బుచ్(Madhabi Puri Buch) రేపు పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(PAC) ముందు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. సెబీ చీఫ్(SEBI Chief)గా ఉంటూ పరస్పర విరుద్ధ ప్రయోజనాల పొందారని ఆమెపై ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై వివరణ ఇవ్వాలని పీఏసీ మాధబికి నోటీసులు జారీ చేసింది. దీంతో సెబీ పని తీరును సమీక్షించేందుకు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్(KC Venugopal) నేతృత్వంలో జరగనున్న పార్లమెంట్ కమిటీ ముందు ఆమె గురువారం హాజరు కానున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరగనుంది. అయితే ఈ చర్యలను బీజేపీ పార్టీ ఎంపీ నిషికాంత్ దూబే(Nishikant Dubey) ఖండించారు. రాజకీయ కక్ష్యతోనే మాధబి పురీని పీఏసీ ముందు హాజరవ్వాలని ఆదేశాలు ఇచ్చారని ఆరోపించారు. కాగా పార్లమెంట్ చట్టం ద్వారా స్థాపించబడిన రెగ్యులేటరీ బాడీల పనితీరును సమీక్షించేందుకు పార్లమెంట్ కమిటీకి అధికారాలుంటాయి. అయితే మాధబి పురీ విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పదించిందినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపిన కేంద్రం ఆమెపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవాలని, ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆమెకు క్లీన్ చిట్ తెలిపినట్లు పలు జాతీయ మీడియాలు కథనాలు వెల్లడించిన విషయం తెలిసిందే.

Advertisement
Next Story

Most Viewed