- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చైనాతో కలిసి పనిచేయడానికి సిద్ధం: తైవాన్ అధ్యక్షుడి కీలక ప్రకటన
దిశ, నేషనల్ బ్యూరో: తైవాన్ చుట్టూ చైనా సైనిక కసరత్తులు ముగిసిన నేపథ్యంలో తైవాన్ అధ్యక్షుడు లైచింగ్-తే కీలక ప్రకటన చేశారు. చైనాతో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇరు దేశాల మధ్య పరస్పర అవగాహన, సయోధ్యను పెంపొందించడానికి ఎదురుచూస్తున్నానని చెప్పారు. దక్షిణ తైనాన్‌లో ఆదివారం జరిగిన డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. తైవాన్‌లో ఘర్షణలు సృష్టించడం, ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తే అంతర్జాతీయ సమాజం అంగీకరించబోదని చెప్పారు. తైవాన్ సార్వభౌమత్వాన్ని రక్షించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. తైవాన్ జలసంధిలో శాంతి, స్థిరత్వం ప్రపంచ భద్రతకు ఎంతో అవసరమైందని నొక్కి చెప్పారు. కాగా, తైవాన్ అధ్యక్షుడిగా లైచింగ్ బాధ్యతలు చేపట్టిన అనంతరం చైనా తన వైఖరిని మార్చుకోవాలని పిలుపునిచ్చారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన డ్రాగన్ రెండు రోజుల పాటు తైవాన్ చుట్టూ సైనిక విన్యాసాలు చేపట్టింది. 7 విమానాలు, 14 యుద్ధ నౌకలు, 4 తీర రక్షక నౌకలను మోహరించింది. ఇవి ముగిసిన అనంతరం లై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.