Putin : లాంగ్ రేంజ్ మిస్సైళ్లను వాడారో ఖబడ్దార్.. అమెరికా, నాటోకు పుతిన్ వార్నింగ్

by Hajipasha |
Putin : లాంగ్ రేంజ్ మిస్సైళ్లను వాడారో ఖబడ్దార్.. అమెరికా, నాటోకు పుతిన్ వార్నింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో : అమెరికా, నాటో దేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి గట్టి వార్నింగ్ ఇచ్చారు. రష్యాపై దాడికి లాంగ్ రేంజ్ కలిగిన మిస్సైళ్లను కానీ, ఇతర ఆయుధాలను కానీ వాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన అల్టిమేటం ఇచ్చారు. రష్యాపైకి లాంగ్ రేంజ్ ఆయుధాలను ప్రయోగించే దేశం.. తమతో యుద్ధాన్ని మొదలుపెట్టినట్టుగా పరిగణిస్తామని పుతిన్ తేల్చి చెప్పారు. అమెరికా, ఐరోపా దేశాలు, నాటో దేశాలు తమతో యుద్ధాన్ని కోరుకుంటేనే లాంగ్ రేంజ్ ఆయుధాలను వాడాలని ఆయన సూచించారు.

ఆయా దేశాల నిర్ణయానికి అనుగుణంగా తాము కూడా తీవ్ర నిర్ణయాలను తీసుకుంటామని రష్యా అధ్యక్షుడు హెచ్చరించారు. రష్యాలోకి చొచ్చుకు రాగలిగే లాంగ్ రేంజ్ మిస్సైళ్లను ఉక్రెయిన్‌కు ఇవ్వాలా ? వద్దా ? అనేది నాటో దేశాలు, ఐరోపా దేశాలు, అమెరికాయే తేల్చుకోవాలన్నారు. ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటే.. రష్యా వైపు నుంచి వచ్చే బలమైన ప్రతిఘటన కోసం ఎదురుచూడాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed