- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Putin : ట్రంప్ సిన్సీయర్.. ఉక్రెయిన్ యుద్ధం ముగియాలి అనడం కరెక్టే : పుతిన్
X
దిశ, నేషనల్ బ్యూరో : అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ నవంబరు 5న జరగబోతోంది. ఈ తరుణంలో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కొనియాడారు. ట్రంప్ చాలా సిన్సీయర్ అని కితాబిచ్చారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగియాల్సిన అవసరం ఉందని ఇటీవలే ట్రంప్ చేసిన వ్యాఖ్యలను తాను స్వాగతిస్తున్నానని పుతిన్ చెప్పారు.
‘‘ట్రంప్‌లా సిన్సీయర్‌గా ఎవరు మాట్లాడినా మేం స్వాగతిస్తాం. మంచిని ఎవరు వినిపించినా వింటాం.. అవతలి వైపు ఎవరున్నారు అనేది పట్టించుకోం’’ అని రష్యా అధ్యక్షుడు పేర్కొన్నారు. ‘‘రష్యాతో సంబంధాలను మెరుగుపర్చుకోవాలని అమెరికా భావిస్తే సంతోషమే.. మేం కూడా అందుకు సిద్ధపడతాం’’ అని పుతిన్ స్పష్టం చేశారు. రష్యాలోని కజన్ నగరంలో బ్రిక్స్ సదస్సు ముగిసిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Advertisement
Next Story