- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్: అట్టుడికిపోతున్న పాకిస్థాన్.. భద్రత బలగాల కాల్పుల్లో ముగ్గురు మృతి
దిశ, వెబ్‌డెస్క్: పాకిస్థాన్‌లో దేశవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాక్ మాజీ ప్రధాని, పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్‌కు నిరసనగా ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున చేస్తోన్న ఆందోళనలతో దాయాది దేశం అట్టుడికిపోతుంది. మంగళవారం సాయంత్రం మొదలైన ఈ ఆందోళనలు ఇవాళ ఉదృతంగా మారాయి. దేశవ్యాప్తంగా పీటీఐ కార్యకర్తలు ఆందోళనలతో విధ్వంసం సృష్టిస్తుండటంతో భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి.
పాక్‌లోని క్వెట్టాలో ఆందోళనలు మరింత హింసాత్మకంగా మారడంతో నిరసనకారులను అదుపు చేసేందుకు భద్రత బలగాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా.. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డట్లు పాక్ మీడియా వెల్లడించింది. పలుచోట్ల ఇమ్రాన్ అభిమానులు, పీటీఐ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తుండటంతో భారీగా భద్రత బలగాలను మోహరించారు. ఇక, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతుండటంతో పాక్ ప్రభుత్వం ఈ విషయంపై స్పందించింది. అల్ ఖదీర్ ట్రస్ట్ నిధుల్లో అక్రమాల కేసులో ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్ట్ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.