రాజీనామా దిశగా బంగ్లాదేశ్ ప్రధాని!

by M.Rajitha |
రాజీనామా దిశగా బంగ్లాదేశ్ ప్రధాని!
X

దిశ, వెబ్ డెస్క్ : ఈ రోజు బంగ్లాదేశ్ లో చెలరేగిన రిజర్వేషన్ల గొడవ బీభత్సమయిన హింసాకాండగా మారడంతో ప్రధాని షేక్ హసీనా రాజీనామ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా రిజర్వేషన్ల సవరణ కోసం ఆందోళనకారులు అంతకంతకూ పట్టు బిగిస్తుండగా.. అధికార పార్టీ మద్దతుదారులు సైతం ఆందోళనలకు దిగుతున్నారు. ప్రధాని షేక్ హసీనా రాజీనామా పిలుపుతో మొదలయిన అల్లర్లు కొద్దిసేపట్లోనే దేశమంతా పాకాయి. దీంతో ఆదివారం ఒక్కరోజే రాజధాని ఢాకా సహ అన్ని నగరాల్లో అల్లర్లు చెలరేగి 72 మందికి పైగా చనిపోగా.. ప్రభుత్వం దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది. అయినప్పటికీ హింసాకాండ ఆగకపోగా మరింత తీవ్రమయింది. దీనికి బాధ్యత వహిస్తూ ప్రధాని రాజీనామా చేయనున్నట్టు సమాచారం. బంగ్లాను 15 ఏళ్ళకు పైగా పాలిస్తూ వరుసగా నాలుగోసారి అధికారంలోకి వచ్చిన హసీనకు ఈ అల్లర్లు సవాలుగా మారాయి. రాజధానిలోని రోడ్లపై నిరసనకారులు ఆయుధాలు పట్టుకొని తిరుగుతూ, రాజధానిని జిల్లాలతో కలిపే రహదారులన్నిటిని మూసేశారు. ఒక్క సిరాజ్ గంజ్ పోలీస్ స్టేషన్ మీద జరిగిన దాడి ఘటనలోనే 13 మంది పోలీసులు సజీవ దహనం అయ్యారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

Next Story

Most Viewed