- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇండియన్ నేవీపై సముద్రపు దొంగల కాల్పులు..కారణమిదే!
దిశ, నేషనల్ బ్యూరో: గతేడాది డిసెంబర్ 23న సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేసిన ఎంపీ రుయెన్ అనే వాణిజ్య నౌకను రక్షించేందుకు భారత నావికాదళం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఈ నెల 15న ఇండియన్ నేవీ ఆ నౌకను అడ్డుకుంది. దీంతో సముద్రపు దొంగలు నేవీ అధికారులపై కాల్పులకు తెగపడ్డారు. దీనికి సంబంధించిన వీడియోను భారత నేవీ షేర్ చేసింది. ‘గతేడాది డిసెంబర్‌లో మాల్టాకు చెందిన ఎంవీ రుయెన్ అనే ఓడను హైజాక్ చేశారు. వారు సముద్రంలో దోపిడీకి ఈ నౌకను ఉపయోగిస్తున్నారు. దీనిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ నేపథ్యంలోనే దొంగలు కాల్పులు ప్రారంభించారు’ అని పేర్కొంది. అయితే నావికుల భద్రతకు కట్టుబడి ఉన్నామని తెలిపింది. సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేసిన మర్చంట్ వెసెల్ ఎంవీ రుయెన్ అదే నౌక అని, సముద్రంలో నిఘా కార్యకలాపాలను నిర్వహించడానికి బయలు దేరినట్టు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. అంతకుముందు ఇండియన్ నేవీ హిందూ మహాసముద్రంలో సోమాలియా సముద్రపు దొంగల నుంచి బంగ్లాదేశ్ నౌక ఎంవీ అబ్దుల్లాను రక్షించింది. మార్చి12న మొజాంబిక్ నుండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి వెళ్తున్న బంగ్లాదేశ్ వ్యాపారి నౌక అబ్దుల్లాపై 15-20 మంది సాయుధ దొంగలు దాడి చేయగా ఇండియన్ నేవీ సహాయక చర్యలు చేపట్టి సేవ్ చేసింది.