పెట్రోల్, డిజీల్‌పై మరో రూ.32 పెంపు!

by Javid Pasha |   ( Updated:2023-02-15 13:32:56.0  )
పెట్రోల్, డిజీల్‌పై మరో రూ.32 పెంపు!
X

ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో ఆర్థిక సంక్షోభాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ధరల పిడుగును ప్రజల నెత్తిన మోపేందుకు సిద్ధమైంది. ఇప్పటికే నిత్యవసరాల ధరలు పెరిగి, సామాన్యులకు అందుబాటులో లేకపోగా, తాజాగా ఇంధన ధరలను పెంచేందుకు అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. గురువారం నుంచి పెట్రోల్, డిజీల్‌పై లీటరుకు పాక్ కరెన్సీలో రూ.32 పెంచనున్నట్లు స్థానిక కథనాలు పేర్కొన్నాయి. ఇప్పటికే దేశంలో పెట్రోల్, డిజీల్ ధరలు రూ.200 దాటిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ప్రపంచ సంస్థల నుంచి సాయం అంతుచిక్కని ప్రశ్నగా మారడంతో పాక్ స్వీయ ప్రయత్నాలు ప్రారంభించింది. తాజాగా పెట్రోల్, డిజీల్‌పై 12 శాతం ధరలను పెంచనున్నాయి. మరోవైపు పేదవాడి ఇంధనం కిరోసిన్ ధరలు కూడా 14 శాతం పెరగనున్నాయి. చమురు దిగుమతుల వ్యయం పెరగడం వంటి కారణాలతో పాకిస్థాన్‌లో కొంతకాలంగా పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. ఇక గోధుమ, పాలు, మాంసం ధరలది ఇదే పరిస్థితి ఉంది. ప్రస్తుతం లీటర్ పాల ధర రూ.200 పైన ఉంది.

Also Read:

North Korea :కిమ్ జాంగ్ కూతురి పేరిట స్టాంపులు

Advertisement

Next Story

Most Viewed