ఆ రెండు దేశాల మధ్య ప్రయాణానికి నో వీసా: మార్చి 1 నుంచి అమల్లోకి

by samatah |
ఆ రెండు దేశాల మధ్య ప్రయాణానికి నో వీసా: మార్చి 1 నుంచి అమల్లోకి
X

దిశ, నేషనల్ బ్యూరో: చైనా, థాయిలాండ్ మధ్య పరస్పర వీసా మినహాయింపు ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఆదివారం బ్యాంకాక్‌లో థాయ్‌లాండ్ విదేశాంగ మంత్రి పర్న్‌ప్రీ బహిద్ధా నుకర, చైనా కౌంటర్ వాంగ్‌యిలు అగ్రిమెంట్‌పై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం మార్చి 1 నుంచి అమల్లోకి వస్తుంది. దీంతో ఆ రెండు దేశాల ప్రజలు ఒకరి దేశానికి మరొకరు వీసా లేకుండా ప్రయాణించొచ్చు. కరోనా నుంచి తిరిగి కోలువకోవడానికి ఎంతో శ్రమిస్తున్న తరుణంలో ఈ ఒప్పందం తమకు ఎంతో ఉపయోగపడుతుందని థాయ్ అధికారులు భావిస్తున్నారు. అంతేగాక పర్యటక రంగాన్ని ప్రోత్సహించడానికి ఎంతో మంది చైనీయులను ప్రోత్సహిస్తుందని వెల్లడించారు. ‘ఈ ఒప్పందం ఇరు దేశాల చిరకాల స్నేహం, విశ్వాసానికి ప్రతీక. రెండు దేశాల్లోనూ టూరిజం పరిశ్రమను ప్రోత్సహించడానికి దోహదపడుతుంది’ అని థాయ్‌లాండ్ విదేశాంగ మంత్రి పర్న్ ప్రీ తెలిపారు. థాయ్ లాండ్, చైనా ప్రజలు ఒకే కుటుంబం లాంటి వారని కొనియాడారు. అయితే ఈ ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు ప్రకటించలేదు. ఈ నెల 30 వరకు దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed