Chandrayaan-3: ‘విక్రమ్’ ల్యాండర్ 3డీ ఫోటోలు తీసిన నాసా..

by Vinod kumar |
Chandrayaan-3: ‘విక్రమ్’ ల్యాండర్ 3డీ ఫోటోలు తీసిన నాసా..
X

వాషింగ్టన్ : చంద్రయాన్ -3 మిషన్‌లో భాగంగా చంద్రుడిపై భారత్ సక్సెస్ ఫుల్‌గా దింపిన ల్యాండర్ విక్రమ్ ఫోటోలను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ క్లిక్ అనిపించింది. లూనార్ రీకన్నైసెన్స్‌ ఆర్బిటార్‌(ఎల్ఆర్వో) స్పేస్‌క్రాఫ్ట్‌‌తో ఈ ఫొటోలను తీశామని నాసా వెల్లడించింది. ఎల్ఆర్వో లోని అనాగ్లిఫ్‌ టెక్నిక్‌ ను ఉపయోగించి ల్యాండర్ విక్రమ్ 3డీ ఫొటోను ఆగస్టు 27న తీశామని ట్విట్టర్ వేదికగా తెలిపింది. ల్యాండర్ విక్రమ్ చంద్రుడిపై దిగిన నాలుగురోజుల తర్వాత ఈ ఫొటోను తీసినట్టు పేర్కొంది.

జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్ దిగుతున్నప్పుడు కలిగిన రాపిడి వల్ల ల్యాండింగ్ ప్రదేశంలో తెల్లని వలయం ఏర్పడిందని నాసా ఫోటోలను బట్టి తెలుస్తోంది. విక్రమ్‌ దిగిన ప్రాంతంలో చంద్రుడి ఉపరితలం ఎలా ఉందనేది ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది. దీనిపై స్పందించిన ఇస్రో.. స్టీరియో లేదా మల్టీ వ్యూ ఇమేజ్‌లను ఒకచోట చేర్చి, అవి మూడు కోణాల్లో కనిపించేలా చేయడమే అనాగ్లిఫ్‌ టెక్నాలజీ అని వివరించింది. నాసా షేర్ చేసిన 3డీ ఫోటోలను సునిశితంగా చూడాలంటే.. త్రీడీ గ్లాసెస్‌ను వాడాలని సూచించింది.

Advertisement

Next Story

Most Viewed