Kejriwal Model: అమెరికాకు చేరిన ‘ఉచితాలు’.. ట్రంప్ పై కేజ్రీవాల్ ట్వీట్

by Mahesh Kanagandla |
Kejriwal Model: అమెరికాకు చేరిన ‘ఉచితాలు’.. ట్రంప్ పై కేజ్రీవాల్ ట్వీట్
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఓ ట్వీట్ పై ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ నేషనల్ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్ రియాక్ట్ అయ్యారు. ఎన్నికల్లో ఉచితాల హామీలు ఇచ్చే ఒరవడి అమెరికా వరకూ చేరిందని ట్వీట్ చేశారు. తమను గెలిపిస్తే 12 నెలల్లో విద్యుచ్ఛక్తి ధరను సగానికి తగ్గిస్తానని డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన హామీని అరవింద్ కేజ్రీవాల్ పేర్కొంటూ పై కామెంట్ చేశారు. విద్యుత్ రేట్లు సగం తగ్గిస్తానని ట్రంప్ హామీ ఇచ్చాడని, ఉచితాల పథకాలు అమెరికా వరకూ చేరాయని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఉచిత తాగునీరు, మహిళలకు ఉచిత బస్సు రవాణా వంటి అనేక ఉచిత పథకాలను ఢిల్లీ ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఉచితాలతో ప్రభుత్వ ఖజానాను రిస్క్‌లో పెడుతున్నదంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఢిల్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో డొనాల్డ్ ట్రంప్ ట్వీట్‌ను ఆప్ తమకు అనుకూలంగా వాడుకుంటున్నది. కేజ్రీవాల్ పాలనకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభిస్తున్నదని, అంతర్జాతీయ స్థాయిలో ఆయన తన పాలనను ఓ బెంచ్‌మార్క్‌గా నిలిపారని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ట్వీట్ చేశారు. అందరికీ అందుబాటులో ఉండే విద్యుత్, ఉచిత తాగునీరు, నాణ్యమైన వైద్యం, అంతర్జాతీయ స్థాయి విద్య వెరసి కేజ్రీవాల్ పాలన మోడల్ అవుతుందని వివరించారు.

Advertisement

Next Story

Most Viewed