Rupee vs Dollar: తొలిసారి రూ. 84కి పడిపోయిన డాలరుతో రూపాయి మారకం విలువ

by S Gopi |
Rupee vs Dollar: తొలిసారి రూ. 84కి పడిపోయిన డాలరుతో రూపాయి మారకం విలువ
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత కరెన్సీ రూపాయి జీవితకాల కనిష్ఠానికి పడిపోయింది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) దేశీయ ఈక్విటీల్లో అమ్మకాలు కొనసాగించడం, ముడి చమురు ధరలు పెరుగుతున్న ఆందోళనల మధ్య రూపాయి శుక్రవారం తొలిసారిగా డాలరుకు రూ. 84 దిగువకు పడిపోయింది. ఆఖరుకు భారత రూపాయి మారకం డాలరుతో పోలిస్తే ఆల్‌టైమ్ కనిష్టం రూ. 84.11కి క్షీణించింది. 2022, అక్టోబర్ 19న రూ. 83 స్థాయిని తాకిన తర్వాత డాలర్‌కు రూ. 84 మార్కును అధిగమించడానికి దాదాపు రెండు సంవత్సరాలు పట్టింది. మిడిల్ ఈస్ట్‌లో పరిస్థితులు రోజురోజుకు తీవ్రం కావడంతో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు దాదాపు 79 డాలర్లకు చేరుకుంది. ఈ నెల ప్రారంభం నుంచే ముడి చమురు ధరలు 10 శాతం మేర పెరగడం గమనార్హం. ఇదే సమయంలో అమెరికాలో ద్రవ్యోల్బణం మళ్లీ పెరగడంతో ఫెడ్ వడ్డీ రేట్లపై ప్రభావం ఉండొచ్చనే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ పరిణామాల కారణంగానే భారత రూపాయిపై ఒత్తిడి పెరిగింది.

Advertisement

Next Story

Most Viewed