ఆస్ట్రేలియాకు భారీ షాక్.. టీమిండియాతో పోరుకు స్టార్ ఆల్‌రౌండర్ దూరం?

by Harish |
ఆస్ట్రేలియాకు భారీ షాక్.. టీమిండియాతో పోరుకు స్టార్ ఆల్‌రౌండర్ దూరం?
X

దిశ, స్పోర్ట్స్ : టీమిండియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియాకు గట్టి షాక్ తగిలేలా కనిపిస్తున్నది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ సిరీస్ మొత్తానికి దూరం కానున్నట్టు తెలుస్తోంది. వచ్చే నెల 22 నుంచి ఐదు టెస్టుల సిరీస్‌కు ఆస్ట్రేలియా ఆతిథ్యమివ్వనుంది. వెన్ను ముక గాయంతో గ్రీన్ సతమతమవుతున్నట్టు ప్రముఖ మీడియా సంస్థ పేర్కొంది. ‘గాయానికి శస్త్ర చికిత్స అత్యవసరమని గ్రీన్‌కు వైద్యులు సూచించారు. సర్జరీ కోసం అతను న్యూజిలాండ్‌కు వెళ్లనున్నాడు.’ అని సదరు మీడియా సంస్థ పేర్కొంది. గ్రీన్‌ అందుబాటులో ఉంటాడా?లేదా? అన్న దానిపై క్రికెట్ ఆస్ట్రేలియా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. జట్టులో కీలక ప్లేయర్‌గా ఉన్న గ్రీన్ ఒకవేళ దూరమైతే ఆసిస్‌కు భారీ ఎదురుదెబ్బే అని చెప్పొచ్చు. గత నాలుగు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలను టీమిండియానే సొంతం చేసుకుంది. అందులో రెండుసార్లు ఆసిస్ గడ్డపై గెలిచింది.

Advertisement

Next Story

Most Viewed