- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Jio Finance App: పూర్తిస్థాయిలో జియోఫైనాన్స్ యాప్ ప్రారంభించిన రిలయన్స్
దిశ, బిజినెస్ బ్యూరో: రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆర్థిక సేవల విభాగం జియో ఫైనాన్స్ పూర్తిస్థాయిలో రూపొందించిన యాప్‌ను శుక్రవారం అందుబాటులోకి తీసుకొచ్చింది. తొలుత యూపీఐ, డిజిటల్ బ్యాంకింగ్ సేవల కోసం ఈ ఏడాది మే 30న ప్రయోగాత్మకంగా జియో ఫైనాన్స్ యాప్‌ను పైలట్ ప్రాజెక్టు రూపంలో తీసుకొచ్చింది. ఆ తర్వాత వినియోగదారుల నుంచి అందిన సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకుని పూర్తిస్థాయిలో యాప్‌ను తీసుకొచ్చినట్లు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది. జియో ఫైనాన్స్ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌తో పాటు యాపిల్ యాప్ స్టోర్, మైజియోలో లభిస్తుంది. బీటా వెర్షన్‌పై వచ్చిన సూచనల ఆధారంగా ఈ యాప్‌లో కొత్తగా మ్యూచువల్ ఫండ్స్‌పై రుణాలు, గృహ రుణాలు, ప్రాపర్టీ లోన్స్ వంటి సేవలను జతచేసింది. ముఖ్యంగా బయోమెట్రిక్, ఫిజికల్ డెబిట్ కార్డును ఉపయోగించి జియో పేమెంట్స్ బ్యాంక్ డిజిటల్ సేవింగ్స్ ఖాతాను కేవలం 5 నిమిషాల్లో తెరవవచ్చని కంపెనీ పేర్కొంది. దీని ద్వారా యూపీఐ చెల్లింపులు, మొబైల్ రీఛార్జ్, క్రెడిట్ కార్డ్ బిల్లులను చెల్లించే ఫీచర్‌లను కూడా కలిగి ఉంటుంది. ఇది కాకుండా జియో ఫైనాన్స్ యాప్ నుంచి లైఫ్, హెల్త్, టూ-వీలర్, మోటార్ ఇన్సూరెన్స్‌లకు సంబంధించి 24 బీమా ప్లాన్‌లను ఎంచుకోవచ్చు. ఇక, ప్రస్తుతం ఇతర పేమెంట్ ప్లాట్‌ఫామ్‌లు మొబైల్ రీఛార్జీలపై ఫీజు వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి జియో ఫైనాన్స్ తన యాప్ నుంచి చేసే రీఛార్జీలకు ఎటువంటి ఫీజు వసూలు చేయబోమని వెల్లడించింది.