Sabarimala : శబరిమల దర్శన వేళల్లో మార్పులు.. ట్రావన్‌కోర్ దేవస్వం బోర్డు కీలక ప్రకటన

by Hajipasha |
Sabarimala  : శబరిమల దర్శన వేళల్లో మార్పులు.. ట్రావన్‌కోర్ దేవస్వం బోర్డు కీలక ప్రకటన
X

దిశ, నేషనల్ బ్యూరో : శబరిమల అయ్యప్ప భక్తులకు కీలక అప్‌డేట్. ఈ ఏడాది అయ్యప్ప భక్తుల దర్శన వేళలను పొడిగించినట్లు ట్రావన్‌కోర్ దేవస్వం బోర్డు అధ్యక్షుడు పి.ఎస్.ప్రశాంత్ వెల్లడించారు. ఆలయ ప్రధాన పూజారులను సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. శబరిమలలో అయ్యప్పస్వామి దర్శన వేళలు వేకువజామున 3 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు .. తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కొనసాగుతాయన్నారు. ఈ మార్పు ద్వారా అయ్యప్ప భక్తులకు దర్శనం కోసం దాదాపు 17 గంటల సుదీర్ఘ సమయం పడుతుందని ఎస్.ప్రశాంత్ తెలిపారు.

జనవరి 15న మకర సంక్రాంతి వేళ..

ఈ ఏడాది శబరిమలలో అయ్యప్ప స్వామి మండల పూజా మహోత్సవాలు నవంబరు 15 నుంచి డిసెంబరు 26 వరకు జరగనున్నాయి. వచ్చే సంవత్సరం జనవరి 15న మకర సంక్రాంతి వేళ శబరిమలలో మకర జ్యోతి(మకర విలక్కు) దర్శనమివ్వనుంది. ఈసారి శబరిమలకు వచ్చే అయ్యప్ప భక్తులకు ఆన్‌లైన్ బుకింగ్‌ను కేరళ ప్రభుత్వం తప్పనిసరి చేసింది. స్పాట్ బుకింగ్ ఉండదని స్పష్టం చేసింది. ఆన్ లైన్ బుకింగ్స్ చేసే వారికి 48 గంటల గ్రేస్ పీరియడ్‌ను అందించాలని నిర్ణయించారు. ప్రతిరోజూ గరిష్టంగా దాదాపు 80వేల మంది భక్తులను దర్శనానికి అనుమతించాలని ట్రావన్‌కోర్ దేవస్వం బోర్డు నిర్ణయించింది.

Advertisement

Next Story

Most Viewed