ICICI Bank: క్రెడిట్ కార్డు లావాదేవీలపై ప్రయోజనాలు తగ్గించిన ఐసీఐసీఐ బ్యాంక్

by S Gopi |
ICICI Bank: క్రెడిట్ కార్డు లావాదేవీలపై ప్రయోజనాలు తగ్గించిన ఐసీఐసీఐ బ్యాంక్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ప్రైవేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులకు సంబంధించి కీలక మార్పులు చేసింది. ముఖ్యంగా లావాదేవీలపై ఇచ్చే రివార్డు ప్రయోజనాలను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల బీమా, కిరాణా కొనుగోళ్లు, విమానాశ్రయ లాంజ్ యాక్సెస్, ఇంధన సర్‌ఛార్జ్ మినహాయింపు, ఆలస్య చెల్లింపు రుసుము వంటి సేవలు ప్రభావితం కానున్నాయి. ఈ మార్పులు నవంబర్ 15 నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంకు స్పష్టం చేసింది. బ్యాంకు చేసిన మార్పుల్లో.. బీమా, యుటిలిటీ బిల్లుల చెల్లింపులపై ఇస్తున్న పరిమితిని ప్రీమియం కార్డు హోల్డర్లకు రూ. 80 వేలు, సాధారణ కార్డు హోల్డర్లకు రూ. 40 వేలు మాత్రమే రివార్డు ఇవ్వనుంది. కిరాణా ఖర్చులకు సంబంధించి రూ. 40 వేలు, ఇంధన సర్‌ఛార్జ్ నెలకు రూ. 50 వేల వరకే మినహాయింపు లభిస్తుంది. థర్డ్ పార్టీ యాప్‌ల నుంచి చెల్లించే ఎడ్యుకేషన్ ఫీజులపై 1 శాతం చెల్లించాల్సి ఉంటుంది. ఇక, లేట్ పేమెంట్ ఛార్జీలకు సంబంధించి రూ. 100 వరకు ఎలాంటి ఛార్జీలు ఉండవు. రూ. 100-500 వరకు రూ. 100 ఉండగా, గరిష్ఠంగా రూ. 50 వేల పైన ఉంటే రూ. 1,300 చెల్లించాల్సి ఉంటుందని బ్యాంకు పేర్కొంది. లాంజ్ యాక్సెస్ కోసం ఒక త్రైమాసికంలో రూ.75వేలు అంతకంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed