- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆగిపోయిన NASA ఆర్టెమిస్ మూన్ రాకెట్ ప్రయోగం.. ఇదే కారణం..?!
దిశ, వెబ్‌డెస్క్ః కొన్ని దశాబ్దాల తర్వాత చంద్రుడిపైకి వెళ్లేందుకు NASA మానవ రహిత మూన్ రాకెట్ ఆర్టెమిస్-1ను ప్రయోగిస్తున్నట్లు ప్రకటించింది. మరో కొన్ని గంటల్లో మూన్ రాకెట్ గగనతలంలోకి ఎగరనుండగా.. అమెరికన్ స్పేస్ ఏజెన్సీ తన పెద్ద న్యూ మూన్ రాకెట్ - స్పేస్ లాంచ్ సిస్టమ్ ప్రయోగాన్ని నిలిపివేసింది. రాకెట్ నుండి ఇంధనం లీక్ అవుతుండగా ప్రయోగాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. అయితే, ఇంజిన్ సమస్యను సులభంగా పరిష్కరించగలిగితే, శుక్రవారం మళ్లీ ప్రయత్నించే అవకాశం ఉన్నట్లు నాసా వర్గాలు తెలిపాయి. దీనికి ముందు, 100మీ-ఎత్తు ఉన్న ఆర్టెమిస్ ఇంజిన్‌ను దాని సరైన ఆపరేటింగ్ ఉష్ణోగ్రతకు సరిపోయినంత చల్లబరచడానికి కంట్రోలర్‌లు చాలా కష్టపడ్డారు. ఇంతకుముందు రాకెట్‌పై పగుళ్లు ఎక్కువగా కనిపించడం గురించి ఆందోళన చెందారు. కాని, చివరికి అది కేవలం మంచుతో ఏర్పడిందని నిర్ధారించారు.
సోమవారం ఆర్టెమిస్-1 లాంచ్‌ను చూడాలనే ఆశతో లక్షలాది మంది ప్రజలు ఫ్లోరిడాకు వెళ్లారు. రోడ్లు కార్లతో నిండియాయి. అయితే, రాకెట్ ప్రయోగం ఆగిపోయిందనే వార్తతో అంతా అసంతృప్తితో వెనుతిరిగారు.
- Tags
- NASA