WAR: ఉక్రెయిన్‌ యుద్ధంలో 66 వేల మందికి పైగా రష్యా సైనికులు మృతి

by Harish |   ( Updated:2024-08-31 14:41:49.0  )
WAR: ఉక్రెయిన్‌ యుద్ధంలో 66 వేల మందికి పైగా రష్యా సైనికులు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: కొన్నేళ్లుగా జరుగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో దాదాపు 66,000 మందికి పైగా రష్యా సైనిక సిబ్బంది మృతి చెందినట్లు స్వతంత్ర రష్యా మీడియా సంస్థ మీడియాజోనా శనివారం తెలిపింది. ఈ సంస్థ ఓపెన్ సోర్స్ డేటాను ఉపయోగించి BBC రష్యన్ సర్వీస్‌తో కలిసి సైనికుల మరణాల జాబితాను రూపొందిస్తోంది. తాజాగా ఈ డేటాను విడుదల చేసింది. మీడియా సంస్థ పేర్కొన్న దాని ప్రకారం, ఏప్రిల్‌ నాటికి రష్యా సైనికుల మరణాలు 50,000కు చేరుకోగా, ఆగస్టు 30 నాటికి, అది 66,471కు చేరుకుంది, గత కొన్ని నెలల్లోనే ఈ సంఖ్య వేగంగా పెరిగింది. అలాగే, ఉక్రెయిన్ యుద్ధంలో చనిపోయిన సైనికుల పేర్లు కూడా మాకు తెలుసు అని సంస్థ శనివారం తెలిపింది.

అయితే పూర్తి మరణాలపై ఖచ్చితమైన వివరాలు తెలియకపోవడంతో ఇది ఖచ్చితమైన సంఖ్య అని స్పష్టంగా చెప్పలేమని మరణాల సంఖ్య మరింత ఎక్కువగా కూడా ఉండవచ్చని పేర్కొంది. యుద్ధం ప్రారంభమైన తొలి నెలల్లో ఎక్కువ మరణాలు చోటుచేసుకోగా, నిర్బంధ సైనికులు కూడా యుద్ధంలో ఎక్కువగానే మరణించారని, మొత్తంగా చనిపోయిన వారిలో 33-35 వయసు గల వారు ఎక్కువగా ఉన్నారని మీడియాజోనా తెలిపింది. మరోవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ జూన్‌లో ఉక్రెయిన్‌లో దాదాపు 70,00,000 మంది రష్యన్ సైనికులు పోరాడుతున్నారని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed