Sienna Weird: మిస్‌ యూనివర్స్‌ ఫైనలిస్ట్‌ సియెన్నా వీర్‌ మృతి.. 23 ఏళ్లకే తీరిన ఆయువు!

by S Gopi |   ( Updated:2023-05-07 02:28:23.0  )
Sienna Weird: మిస్‌ యూనివర్స్‌ ఫైనలిస్ట్‌ సియెన్నా వీర్‌ మృతి.. 23 ఏళ్లకే తీరిన ఆయువు!
X

దిశ, వెబ్ డెస్క్ : మిస్‌ యూనివర్స్‌ (Miss Universe) ఫైనలిస్ట్‌, ఆస్ట్రేలియన్‌ ఫ్యాషన్‌ మోడల్‌ సియెన్నా వీర్‌ (Sienna Weir) మృతిచెందింది. 23 ఏండ్ల సియెన్నా గత నెల 2న గుర్రపు స్వారీ చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడిపోయింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమె.. అప్పటి నుంచి లైఫ్‌ సపోర్ట్‌పై ఉన్నది. అయితే గత నెలరోజులుగా చికిత్స అందిస్తున్నప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పులేకపోవడంతో.. ఆమె కుటుంబ సభ్యులు లైఫ్‌ సపోర్టును తీసేయాలని నిర్ణయించారు. దీంతో ఆమె కన్నుమూసింది. సియెన్నా.. 2022లో జరిగిన ఆస్ట్రేలియన్‌ మిస్‌ యూనివర్స్‌ పోటీలకు ఎంపికైన 27 మంది ఫైనలిస్టుల్లో ఒకరు.

ఇంగ్లిష్‌ లిటరేచర్‌తోపాటు సైకాలజీలో కూడా సియెన్నా డబుల్‌ డిగ్రీ చేసింది. మూడేళ్ల వయసు నుంచే గుర్రపు స్వారీ చేస్తున్న సియాన.. గత నెలలో ఆస్ట్రేలియాలోని విండ్సర్ పోలో గ్రౌండ్స్ లో గుర్రంపై పరుగులు తీస్తుండగా ప్రమాదం జరిగింది. వేగంగా పరిగెత్తుతున్న గుర్రం అకస్మాత్తుగా కిందపడిపోయింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడిందని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి:

Pakistan | తీవ్ర ఆర్ధిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్.. కరిగిపోతున్న విదేశీ కరెన్సీ నిలువలు

Advertisement

Next Story