- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Michelle Obama: జో బైడెన్‌కు ఊహించని షాక్.. డెమొక్రాటిక్ అభ్యర్థిగా మిచెల్లీ ఒబామా!
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఊహించని షాక్ తగిలింది. రానున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా జో బైడెన్ కంటే మిచెల్లీ ఒబామానే మేలని మెజారిటీ ప్రజలు భావిస్తున్నట్లు ఇటీవల జరిపిన రాస్ముస్సేన్ సర్వేలో తేలింది. ఈ మేరకు దాదాపు సగం మంది డెమొక్రాట్లు బైడెన్‌కు బదులు మిచెల్లీ ఒబామావైనే అధ్యక్ష అభ్యర్థిగా ఉండాలని అనుకుంటున్నారు. నవంబర్‌లో జరిగే ఎన్నికలకు జో బైడెన్ స్థానంలో మరొక అభ్యర్థిని పార్టీ గుర్తించే ప్రక్రియను తాము ఆమోదిస్తున్నట్లు ఓటింగ్‌లో పాల్గొన్న డెమొక్రాట్‌లలో 48 శాతం మంది తమ అంగీకారాన్ని తెలిపారు. అదేవిధంగా బైడెన్ స్థానంలో ఇతర పోటీదారులు వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్, మాజీ విదేశాంగ కార్యదర్శి హిల్లరీ క్లింటన్, కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్, మిచిగాన్ గవర్నర్ గ్రెట్చెన్ విట్మర్ కంటే అధికంగా మిచెల్ ఒబామాకు 20 శాతం ఓట్లు రావడం విశేషం. అయితే, అధ్యక్ష పదవికి అభ్యర్థి విషయంలో భారత సంతతికి చెందిన మహిళ కమలా హ్యారిస్‌కు, హిల్లరీ క్లింటన్ కంటే ఎక్కువ శాతం ఓట్లు రావడం సంచలనంగా మారింది.