'స్త్రీ, పురుషులు సమానం కాదు'.. తాలిబాన్ విద్యామంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

by Vinod kumar |
స్త్రీ, పురుషులు సమానం కాదు.. తాలిబాన్ విద్యామంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
X

కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వ విద్యాశాఖ మంత్రి నెదా మహ్మద్ నదీమ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. షరియా ప్రకారం.. స్త్రీ, పురుషులు సమానులు కానే కాదన్నారు. అయినప్పటికీ పాశ్చాత్య దేశాలు స్త్రీలను పురుషుడి కంటే ఎక్కువగా చూపించే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. బాగ్లాన్ యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..‘‘ఆ భగవంతుడే స్త్రీ పురుషుల మధ్య తేడాను చూపాడు. మగవాడు పాలకుడు.. అతడికి అధికారాన్ని స్త్రీ అంగీకరించాలి. దానికి కట్టుబడి ఉండాలి. పురుషుడు క్రియేట్ చేసే ప్రపంచాన్ని స్త్రీ అంగీకరించాలి’’ అని కామెంట్ చేశారు. ఇక ఇదే సమయంలో దేశంలోని ప్రభుత్వ ఉద్యోగులను అందరినీ సమ దృష్టితో చూస్తామని, లింగ వివక్షకు తావు ఉండదని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed