- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
Women's T20 World Cup : న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించిన ఆస్ట్రేలియా
దిశ, స్పోర్ట్స్ : మహిళల టీ20 వరల్డ్ కప్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. షార్జా వేదికగా జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 60 పరుగుల తేడాతో మట్టికరిపించింది. టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసిస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లను కోల్పోయి 148 స్కోరు చేసింది. బెత్ మూనీ(40), ఎల్లీ పెర్రీ(30), అలీస్సా హీలీ(26) రాణించడంతో 109/3 స్కోరుతో నిలిచిన ఆ జట్టు ఆ తర్వాత తడబడి వరుసగా వికెట్లు కోల్పోయింది. కివీస్ బౌలర్లలో అమేలీ కెర్(4/28) సత్తాచాటింది. అనంతరం ఛేదనకు దిగిన న్యూజిలాండ్ 19.2 ఓవర్లలో 88 రన్స్‌కే కుప్పకూలింది. బౌలర్లు మేగన్ షుట్(3/3), సుదర్లాండ్(3/21), సోఫీ మోలినెక్స్(2/15) రెచ్చిపోవడంతో ఆసిస్ విజయం సునాయాసమైంది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో అమేలీ కెర్(29) టాప్ స్కోరర్. ఆమెతోపాటు సుజీ బేట్స్(20), లీ తహుహు(11) మాత్రమే రెండెంకల స్కోరు చేయగా.. మిగతా వారు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఈ విజయంతో ఆస్ట్రేలియా 4 పాయింట్లతో గ్రూపు ఏలో అగ్రస్థానంలో కొనసాగడంతో సెమీస్ ఆశలను మెరుగుపర్చుకుంది.