- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దక్షిణాది రాష్ట్రాల్లో ఫస్ట్ టైమ్.. హైదరాబాద్‌లో నేషనల్ హెల్త్ కాన్ఫరెన్స్
దిశ, తెలంగాణ బ్యూరో : వైద్య హబ్‌గా పేరొందిన హైదరాబాద్‌లో వచ్చే నెల 8, 9 తేదీల్లో నేషనల్ హెల్త్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. దేశ వ్యాప్తంగా ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఈ కాన్ఫరెన్స్ సిటీ శివారులోని లియోనియో రిసార్ట్‌లో జరగనున్నది. సౌత్ స్టేట్‌లో ఇంత భారీ స్థాయిలో నిర్వహించడం ఇదే ఫస్ట్ టైం. దీనిని సక్సెస్ చేసేందుకు రాష్ట్ర హెల్త్ డిపార్ట్‌మెంట్ ఏర్పాట్లు చేస్తున్నది. గడిచిన పదేళ్లలో తెలంగాణకు ఎన్నడూ ఈ అవకాశం లభించలేదు. ప్రతిసారీ ఢిల్లీలో మాత్రమే నిర్వహిస్తూ వచ్చారు. ఈ సారి హైదరాబాద్‌లో నిర్వహించేందుకు సెంట్రల్ హెల్త్ డిపార్ట్‌మెంట్ తీసుకున్న నిర్ణయం అభినందనీయమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సంతోషం వ్యక్తం చేసింది. ఇక జాతీయ స్థాయిలో జరిగే ఈ కాన్ఫరెన్స్‌కు అన్ని రాష్ట్రాల హెల్త్ సెక్రెటరీలు, హెల్త్ హెచ్‌వోడీలు, ఇతర ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. వారితో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు సైతం ఇందులో భాగస్వామ్యం కానున్నారు. ఎన్‌సీడీ పై తమ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు.
ఎన్‌సీడీలో టాప్.. ఇదే కీలకం?
నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ కంట్రోల్‌లో తెలంగాణ పర్‌ఫెక్ట్ ప్లానింగ్‌తో ముందుకెళ్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ గుర్తించింది. ఇతర రాష్ట్రాల కంటే ఎన్‌సీడీ స్క్రీనింగ్ రాష్ట్రంలో మెరుగ్గా జరుగుతోంది. ఇప్పటికే రెండు దఫాలుగా ఎన్‌సీడీ స్క్రీనింగ్ జరుగగా, 2024 మే నుంచి మూడో దఫా కొనసాగుతోంది. 2025 మార్చి వరకు థర్డ్ సెషన్‌ను క్లోజ్ చేయనున్నారు. ఇప్పటి వరకు 30 ఏళ్లకు పైబడిన వారిలో దాదాపు కోటి మందికి పైగా పరీక్షలు నిర్వహించారు. బీపీ, షుగర్ బాధితులకు నెలకు సరిపోయే మందులు అందజేశారు. క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించి, వ్యాధి తీవ్రతరం కాకుండా కేసులను మెడికల్ కాలేజీలకు రిఫర్ చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో ఆశాలు, ఏఏన్‌ఎంలు ఈ స్క్రీనింగ్‌ను సక్సెస్‌ఫుల్‌గా కొనసాగిస్తున్నారు. డిజిటల్ విధానంలోనూ విజయవంతంగా స్క్రీనింగ్ చేస్తున్నారు. ఇక అన్ని మెడికల్ కాలేజీల్లో ఎన్‌సీడీ క్లినిక్‌లు ఓపెన్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 35 ఎన్‌సీడీ క్లినిక్‌లు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ స్థాయిలో మరే రాష్ట్రంలోనూ నిర్వహించడం లేదని వైద్యాధికారులు తెలిపారు. అందుకే సెమినార్ రాష్ట్రంలో జరగబోతున్నదని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.
ఎలా చేస్తున్నారనే దానిపై స్టడీ ?
అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన టీమ్‌లు ఎన్‌సీడీ స్క్రీనింగ్ తీరును ప్రత్యక్షంగా పరిశీలించనున్నాయి. బీపీ, షుగర్ పేషెంట్లను ఎలా గుర్తిస్తున్నారు? ఎలాంటి పరీక్షలు చేస్తున్నారు. మందుల పంపిణీ ఎలా ఉన్నది? పేషెంట్లపై ఆ డ్రగ్స్ ప్రభావం సరిగ్గా ఉన్నదా? టెస్టింగ్ మిషన్ ట్రాన్స్ ఫరసీ ఎలా ఉన్నది? వంటి అంశాలపై ఇతర రాష్ట్రాల అధికారులు స్టడీ చేయనున్నారు. అంతేకాకుండా మేడ్చల్, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్ జిల్లాల్లో జరుగుతున్న ఎన్‌సీడీ స్క్రీనింగ్, పేషెంట్ల కేర్‌ను ఆయా టీమ్‌లు పరిశీలించనున్నాయి. 8న డాక్టర్ల ఓపీనియన్స్ ఉండగా, 9న విజిట్‌లు ఉంటాయని అధికారులు తెలిపారు. ఇదే అంశంపై సోమవారం ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ కార్యాలయంలో సెంట్రల్ ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. రెండు రోజుల పాటు జరిగే ఈ ప్రోగ్రామ్‌ను సక్సెస్ చేయాలని సెంట్రల్ హెల్త్ డిపార్ట్‌మెంట్ ఆదేశాలు జారీ చేసింది. స్టేట్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ఆర్ వీ కర్ణన్ ఈ ప్రోగ్రామ్‌ను విజయవంతం చేసేందుకు తన టీమ్‌తో కలిసి కసరత్తు చేస్తున్నారు.